Atchannaidu: ఎవరూ ఊహించని విధంగా.. ఆరు నెలల్లో : మంత్రి అచ్చెన్నాయుడు
కూటమి ప్రభుత్వానికి కేంద్రం బాగా సహకరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక అన్ని శాఖలపైనా సమీక్ష చేశామని, ఎవరూ ఊహించని విధంగా 6 నెలల్లో వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. అందరూ ఆశ్చర్యపడేలా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రూ.20 వేలు ఇస్తాం. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. రైతులకు రూ.145 కోట్లతో యంత్ర పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రూ.860 కోట్లతో రహదారులు బాగా చేస్తున్నాం. సంక్రాంతి (Sankranti) కి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నది మా లక్ష్యం. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా సూపర్`6 పథకాలన్నీ తప్పక అమలు చేస్తాం అని అన్నారు.