Achennaidu: కేంద్ర మంత్రితో చర్చించి.. తక్షణమే వారిని స్వదేశానికి
సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతను స్వదేశానికి రప్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (achennaidu) తెలిపారు. జిల్లాలోని పలాస, వజ్రకొత్తూరు, సంతబొమ్మాళి, కంచిలి, ఇచ్ఛాపురం ప్రాంతాలకు చెందిన 16 మంది యువకులు అక్కడ చిక్కుకున్నారు. ఏజెంట్ల ద్వారా మోసపోయిన యువకులను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో ఈ అంశంపై చర్చించి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో పరిశ్రమల అభివృద్ధి, యువతలో నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడతామన్నారు.
Tags :