ASBL NSL Infratech

త్వరలో క్యాబినెట్‌ విస్తరణ.. కొత్తగా ఐదారుగురికి ఛాన్స్‌

త్వరలో క్యాబినెట్‌ విస్తరణ.. కొత్తగా ఐదారుగురికి ఛాన్స్‌

త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  క్యాబినెట్‌ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. కొత్తగా ఐదారుగురికి మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంత్రి సీతక్కకు హోం మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, దానం నాగేందర్‌కు క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్‌ నుంచి ఒకరికి క్యాబినెట్‌లో చోటు దక్కొచ్చని తెలిపారు. త్వరలోనే వైద్యశాఖలో ప్రక్షాళన చేపడతామన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :