ASBL Koncept Ambience
facebook whatsapp X

రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది : మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది : మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో కులగణన ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలకు చెందిన వారిపై బీఆర్‌ఎస్‌కు ప్రేమలేదన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బలహీనవర్గాలకు చెందిన వ్యక్తినే కాంగ్రెస్‌ పార్టీ నియమించిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూ, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతోందన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించని కార్యక్రమాలనూ చేపడుతున్నామన్న విషయాన్ని ప్రతిపక్ష నేతలు గుర్తించాలని హితవు పలికారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :