ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదు : మంత్రి కోమటిరెడ్డి
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ లగచర్ల ఘటనలో ప్రణాళిక ప్రకారమే కలెక్టర్‌పై దాడి చేశారు. కేటీఆర్‌తో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడినట్లు రికార్డులు ఉన్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. నిందితులను వదిలిపెట్టం. కేసులు చుట్టుముడుతున్న వేళ, ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నాయకులు ఈ ఉదంతానికి ఒడిగట్టారు. ఫార్ములా `ఈ కారు కేసు వ్యవహారంలో మనీలాండరింగ్‌పై గవర్నర్ అనుమతి ఇస్తే నిందితులు అరెస్టు కావాల్సిందే. అరెస్టయితే యోగా చేస్తా. బయటికొచ్చాక పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పారు. ఈ విషయమై కేంద్రమంత్రితో మాట్లాడేందుకే కేటీఆర్ ఢల్లీి వెళ్లారు అని మంత్రి ఆరోపించారు.
Tags :