ఈ సర్వేతో తెలంగాణ దేశానికే ఆదర్శం : మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్రంలో కుల వివక్షను పోగొట్టడానికే కుల గణన సర్వే చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలిపారు. గాంధీభవన్‌లో జరిగిన మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్‌లో ఆదేశించారు. ఈ సర్వేతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులంతో బీజేపీకి ఏం పని? అని ప్రశ్నించారు. రాహుల్ కులం తెలియాలంటే దేశంలో కులగణన చేయండి. కుల పత్రంతో ఆయన ఇంటికి వెళ్తే చెబుతారని ఎద్దేవా చేశారు. బీజేపీ కొన్ని వర్గాలకే న్యాయం చేస్తుందని మంత్రి మండిపడ్డారు.
Tags :