గురుకులాల్లో కుట్రల వెనుక ఆయన హస్తం : మంత్రి కొండా సురేఖ
సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయింది. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించాం. అయినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయింది. ఆమె మృతిపై రాజకీయాలు చేయడం తగదు. గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలోని భోజనంలో పురుగులు వచ్చేవి. సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు కొరవడినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థిని మృతిని రాజకీయం చేయడం దురదృష్టకరం. గురుకులాల్లో కుట్రల వెనుక బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉంది. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారు. తన అనుచరులను సిబ్బందిగా నియమించుకున్నారు అని ఆరోపించారు.