ASBL Koncept Ambience
facebook whatsapp X

కేటీఆర్ కు కొండా సురేఖ వార్నింగ్..? బీఆర్ఎస్ కౌంటర్స్ స్టార్ట్...

కేటీఆర్ కు కొండా సురేఖ వార్నింగ్..? బీఆర్ఎస్ కౌంటర్స్ స్టార్ట్...

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనపై వస్తున్న ట్రోలింగ్స్‌ను తిప్పికొట్టే క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ.. వ్యక్తిగత విమర్శలకు దిగడంతో.. ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో అక్కినేని కుటుంబం గురించి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాగచైతన్య-సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ల కెరీర్‌ను కేటీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా పలువురు హీరోయిన్లకు డ్రగ్స్‌ అలవాటు చేశారని.. కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇక ఇదే వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు కూడా ట్విటర్ వేదికగా స్పందించారు.

కొండా సురేఖ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే రెండు ఫోటోలను కూడా హరీష్ రావు షేర్ చేశారు. ప్రత్యర్థులు వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటే వారి వద్ద ఒక్క రాజకీయ ఆరోపణ కూడా లేదని చెప్పారు. అసత్య ఆరోపణలు వ్యక్తిగత దూషణలకు దారితీస్తాయని.. అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రత్యర్థుల వ్యక్తిత్వంపై దాడి చేస్తారని ఉన్న కొటేషన్లను హరీష్ రావు షేర్ చేశారు.

మరోవైపు.. తమ కుటుంబంపై చేసిన ఆరోపణలపై స్పందించారు హీరో నాగార్జున ."గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్ధులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను" అంటూ హీరో నాగార్జున ట్వీట్ చేశారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :