ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎన్నారైలు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి : మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు

ఎన్నారైలు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి : మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని, పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని ఏపీ ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో ఎన్ఆర్ ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక పోర్టల్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా పెట్టుబడులు పెట్టే వారు అన్ని రకాల అనుమతులు పొందడం సులభతరం అవుతుందని వెల్లడించారు. ఎన్ఆర్ఐలు తగిన ప్రతిపాదనలతో ముందుకురావాలని పిలుపునిచ్చారు. వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు, అనుమతులు వెంటనే ఇచ్చేందు కు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఔత్సాహిక పెట్టుబడిదారులు తమ ప్రతిపాదనలతో ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగే రోజులకు ఈ ప్రభుత్వంలో కాలం చెల్లిందని చెప్పారు. ప్రభుత్వం రూపొందిస్తున్న యాప్లో రిజిస్టరు అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులే వర్చువల్ కాల్స్ ద్వారా పెట్టుబడిదారులకు అందుబాటులోకి వస్తారని తెలిపారు. వారితో టచ్లో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ అన్నిరకాల సహకారం అందిస్తారని వెల్లడించారు.

ఈ సమావేశానికి ఎన్ఆర్ఐ టీడీపీ కన్వీనర్ కోమటి జయరాం అధ్యక్షత వహించగా రామకృష్ణ గుళ్లపల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో సుధీర్ చింతమనేని, కె.సి.చేకూరి, రవీంద్ర చిట్టూరి, వినోద్ ఉప్పు, సతీష్ కొమ్మన, కిషోర్ చలసాని, కృష్ణమోహన్ దాసరి తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :