ASBL NSL Infratech
facebook whatsapp X

ఎడారి దేశంలో దుర్భర జీవితం ...మంత్రి లోకేష్‌ చొరవతో వీరేంద్రకు విముక్తి

ఎడారి దేశంలో దుర్భర జీవితం ...మంత్రి లోకేష్‌ చొరవతో వీరేంద్రకు విముక్తి

సౌదీ అరేబియాలో దుర్బర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ కాపాడారు. మంత్రి ఆదేశాలతో ఆయన్ను ఎడారి నుంచి స్వస్థలానికి తీసుకొచ్చే ఏర్పాట్ల బాధ్యతను ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం తీసుకుంది. నకిలీ ఏజెంట్‌ చేతితో మోసపోయి దుర్భర జీవతం గడుపుతున్నానంటూ ఇటీవల వీరేంద్ర కుమార్‌ ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు. ఖతర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనను పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని చెప్పారు. వీరేంద్ర వీడియో చూసి స్పందించిన మంత్రి లోకేశ్‌.. దైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం బాధితుడిని స్వస్థలమైన కోనసీమ జిల్లాలోని ఇసుకపూడికి తీసుకువస్తున్నారు. వీరేంద్ర శుక్రవారం ఉదయం శంషాబాద్‌ విమానావ్రయానికి చేరుకున్నారు.  ఆయనకు సోదరి లక్ష్మీతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. తనను రక్షించిన మంత్రి లోకేశ్‌, తెలుగుదేశం ఎన్నారై విభాగానికి వీరేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :