ASBL Koncept Ambience
facebook whatsapp X

నారా లోకేష్ కి శాన్ ఫ్రాన్సిస్కో లో ఘన స్వాగతం

నారా లోకేష్ కి శాన్ ఫ్రాన్సిస్కో లో ఘన స్వాగతం

యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, మానవ వనరులు మరియు ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్స్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎన్నారై టీడీపీ విభాగం అధ్యక్షులు శ్రీ కోమటి జయరాం గారి నేతృత్వంలో బే ఏరియా కి చెందిన టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికరంగానికి పెట్టుబడులను ఆహ్వానించడానికి శ్రీ నారా లోకేష్ ఈనెల 25వ తేదీనుంచి వారంరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో గత ఐదేళ్ళుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పారిశ్రామిక రంగాన్ని సరైన గాడిలో పెట్టి ఉద్యోగావకాశాలు పెద్ద ఎత్తున కల్పించడం ఈ పర్యటన ముఖ్యోద్దేశం.

తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆనంతరం తమ ప్రియతమ యువనాయకుడిని విమానాశ్రయం నుండి ఆయన బస చేస్తున్న హోటల్ వరకు భారీ కార్ ర్యాలీతో తోడ్కొని వెళ్ళారు.

ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎన్నారై టీడీపీ నాయకులు కోగంటి వెంకట్, శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, భక్తా బల్లా, శ్రీకాంత్ దొడ్డపనేని, ప్రసాద్ పైలా, కల్యాణ్ కోటా, శశి దొప్పలపూడి, సతీష్ అంబటి, వెంకట్ అడుసుమల్లి, హరి సన్నిధి, రవి అలేటి, భాస్కర్ అన్నే, విజయ్ సాగర్ రెడ్డి జెట్టి, రమేష్ మల్లారపు తదితరులు సమన్వయపరిచారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :