ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం

అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం

దేశంలో మరే రాష్ట్రానికి లేని కనెక్టివిటీ ఆంధ్రప్రదేశ్ సొంతం!

పెట్టుబడులకు అన్నివిధాలా అనువైన వాతావరణం ఉంది

శాన్ ఫ్రాన్సిస్కో: ఆంధ్రప్రదేశ్ కు దేశంలో మరే రాష్ట్రానికి లేనివిధంగా జల, రోడ్డు, వాయు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, సుమారు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతానికి రోడ్డు కనెక్టివిటీ అనుసంధానమై ఉంది, భారత్ లో ప్రస్తుతం పెట్టుబడిదారులకు అన్నివిధాలా అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రాప్ బాక్స్ కో ఫౌండర్ సుజయ్ జస్వా నివాసంలో పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. అమరావతి రాజధాని పరిసరాల్లో ప్రభుత్వరంగంలో 3బిలియన్ డాలర్లు, ప్రైవేటు రంగంలో 4.5బిలియన్ డాలర్లతో వివిధ నిర్మాణాలు, అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. వీటికితోడుగా రాష్ట్రంలోని మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, మూలపేట ప్రాంతాల్లో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్టులు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు.

ఏడాదిన్నరలో పూర్తికానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయని అన్నారు. అమరావతిలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎఐ సంస్థలకు అవరమైన మ్యాన్ పవర్ అందుబాటులో ఉంటుంది. అన్నివిధాలా అనుకూల వాతావరణం కలిగిన ఎపిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో క్లారిటీ ఎఐ సిటిఓ నిశ్చల్ నాదముని, గ్రీన్ ఓక్స్ ఫౌండర్ నెయిల్ మెహతా, జడ్విఐ ప్లేసర్ ఎఐ సంస్థకు చెందిన నోయెమ్ బెన్, ఆర్బి ఎఐ ప్రతినిధి బెల్లా లియు, జెట్ సింథసిస్ సంస్థ ప్రతినిధి రియో షిమా, పారిశ్రామికవేత్తలు థామస్ ప్యుయాగ్, ఎలెన్ జస్వా, అనిమేష్ కొరటాల, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందసభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :