ASBL Koncept Ambience
facebook whatsapp X

సీఎం చంద్రబాబు కృషితోనే కియా పరిశ్రమ ఏపీకి : మంత్రి

సీఎం చంద్రబాబు కృషితోనే కియా పరిశ్రమ ఏపీకి : మంత్రి

సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలంలోని దుద్దేబండ గ్రామంలో కియా ఇండియా పరిశ్రమ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భూమి పూజా చేశారు. అనంతరం గ్రామంలోని గర్భిణులకు అంగన్వాడీ ఆధ్వర్యంలో సామూహిక సీమంతం నిర్వహించారు. ఆరు నెలల చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు.  

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ  2014-19 మధ్య సీఎం చంద్రబాబు కృషితోనే కొరియా నుంచి కియా పరిశ్రమ ఏపీకి వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేక, ఉపాధి లభించక ప్రజలందరూ వలస వెళ్తున్నారని, ఈ ప్రాంతంలో అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియా ఇండియాను తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. పరిశ్రమ రావడంతో ఈ ప్రాంత ప్రజలకు ఉపాధితో పాటు భూముల ధరల ఉఎకరం రూ.10 లక్షల నుంచి 2 కోట్లకు పెరిగాయన్నారు. పరిశ్రమ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పెనకొండ నియోజకవర్గంలో అనేక పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు రైతులకు పండ్ల మొక్కలను అందజేసి చేయూతనిస్తున్నారని కియా ఇండియా సేవలను కొనియాడాయరు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదర్శ అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడం సంతోషంగా ఉందన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :