ఇజ్రాయెల్ టెక్నాలజీతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు : మంత్రి శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య సహకారానికి ఇజ్రాయెల్ ఆసక్తి చూపడం చాలా సంతోషకరమన్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకారం అందించాలని శ్రీధర్ బాబు కోరారు. రక్షణ, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్న శ్రీధర్ బాబు విజ్ఞప్తిపై ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో 200 ఎకరాల్లో ఏఐ సిటీ నిర్మిస్తున్నామని చెప్పిన తెలంగాణ ఐటీ మంత్రి.. ఏఐ, సైబర్ సెక్యూరిటీపై అత్యాధునిక శిక్షణ అందజేయడానికి ఇజ్రాయెల్ సహకారం కావాలని మంత్రి కోరారు. అలాగే వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికతతో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఇజ్రాయెల్ నుంచి పరిశ్రమలు పెట్టేందుకు ఏ సంస్థ ముందుకొచ్చినా నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. నూతన పరిజ్ఞానం, పరిశ్రమల ఏర్పాటులో సాయపడితే తెలంగాణ నుంచే ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని పేర్కొన్నారు.