ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆరు నెలల్లో కర్నూలుకు... మంత్రి టీజీ భరత్‌

ఆరు నెలల్లో కర్నూలుకు... మంత్రి టీజీ భరత్‌

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. ఈ  సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వం న్యాయరాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ పెడతామని మాత్రమే ఎన్నికల్లో హామీ ఇచ్చాం.  అసెంబ్లీలో ప్రకటనకు ముందే బెంచ్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాం. బెంచ్‌ శాశ్వత భవన నిర్మాణానికి ఏడాదిన్నర పట్టొచ్చు. ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలూ కర్నూలులోనే ఉంటాయి. కర్నూలు నుంచి కార్యాలయాల తరలింపు అనేది వైసీపీ దుష్ప్రచారమే అని మంత్రి తెలిపారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :