ASBL Koncept Ambience
facebook whatsapp X

మీరు లాగేసినా ప్రజలకు నాకు కుర్చీ ఇచ్చారు : మాధవీరెడ్డి

మీరు లాగేసినా ప్రజలకు నాకు కుర్చీ ఇచ్చారు : మాధవీరెడ్డి

కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస జరిగింది. మేయర్‌ ఛాంబర్‌లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి నిల్చొని నిరసన తెలిపారు. మరోవైపు ఆమె మాట్లాడుతుండగా మేయర్‌ సురేశ్‌, కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా మాట్లాడే అవకాశం ఉందని మాధవి పట్టుబట్టారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది. మాధవీరెడ్డి మాట్లాడుతూ పాలకవర్గం తీరుపై మండిపడ్డారు. మహిళను అవమానిస్తారా? మీరు లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు. కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేదు. సమావేశమంతా నిల్చొని మాట్లాడే శక్తి నాకుంది. అహంకారం, అధికారం ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నగరపాలక సంస్థ వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :