ASBL Koncept Ambience
facebook whatsapp X

Modi Decision: కేంద్రం కోర్టులో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం..! మోదీ నిర్ణయంపై ఉత్కంఠ..!!

Modi Decision: కేంద్రం కోర్టులో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం..! మోదీ నిర్ణయంపై ఉత్కంఠ..!!

తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వ్యవహారం వారం రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపైన రోజూ ఏదో ఒక రూపంలో చర్చ జరుగుతూనే ఉంది. కోట్లాది మంది హిందువులు ఈ విషయం వెలుగులోకి రాగానే హతాశులయ్యారు. దీనికి బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి విచారణ మొదలు పెట్టింది. అయితే కల్తీ నెయ్యిపై (adulterated ghee) సుప్రీంకోర్టు (Supreme Court) కూడా విచారణ మొదలు పెట్టింది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టింది.

కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎన్డీయే కూటమి (NDA Alliance) ప్రభుత్వం రాజకీయం చేస్తోందని.. దీనిపై స్వతంత్ర సంస్థ (Independent Enquiry) లేదంటే సుప్రీంకోర్టు జడ్జితో (Supreme court judge) విచారణ జరిపించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి (Subramanya Swamy), మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటితో పాటు మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటన్నిటినీ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు (Supreme Court) ఘాటు వ్యాఖ్యలు చేసింది. కల్తీ నెయ్యిపై ఆధారాలు ఎక్కడున్నాయని ప్రశ్నించింది. విచారణ లేకుండానే సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎలా మాట్లాడతారని నిలదీసింది. చివరగా ఈ వ్యవహారంపై సిట్ విచారణ సరిపోతుందా.. లేకుంటే స్వతంత్ర్య సంస్థ ఏర్పాటు చేయాలా అని సొలిసిటర్ జనరల్ (Solicitor General Thushar Mehta) ను అడిగింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

సొలిసిటర్ జనరలే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. ఆయన కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. కల్తీ నెయ్యి వ్యవహారం చాలా తీవ్రమైనదని.. దీనిపై సమగ్ర దర్యాప్తు కోరుతున్నామని ఆయన నిన్ననే సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని చెప్పాలనడంతో మోదీ ప్రభుత్వం (Modi Government) ఏం చెప్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది. గురువారం కేంద్ర ప్రభుత్వం (Central Govt) తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. సిట్ దర్యాప్తు సరిపోతుంది.. మరొక సంస్థ అవసరం లేదని చెప్తుందా.. లేకుంటే తాము విచారణ జరిపిస్తామని చెప్తుందా.. అనేది ఆసక్తి కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూడా ఎన్డీయే ప్రభుత్వమే (NDA Govt) అధికారంలో ఉంది. ఒకవేళ సిట్ దర్యాప్తు సరిపోతుందని చెప్తే చంద్రబాబు ప్రభుత్వానికి కొండంత అండ లభించినట్లే. చంద్రబాబుపై బీజేపీకి, మోదీ-అమిత్ షాలకు పూర్తి విశ్వాసం ఉన్నట్టు భావించాలి. ఒకవేళ సిట్ తో కాకుండా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించండి అని చెప్తే మాత్రం ఎన్డీయే కూటమికి బీటలు వారినట్టు భావించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పలేం. కాబట్టి ఇక్కడున్నది కూడా తమ ప్రభుత్వమే కాబట్టి సిట్ కు జైకొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ సిట్ ను కాదంటే మాత్రం వైసీపీకి (YSRCP) పండగే.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :