చంద్రబాబు, పవన్ కు మోడీ సరికొత్త టాస్క్..
కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి, జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి మోడీ పెద్ద టాస్క్ అప్పగించారు. ఈ ఇద్దరి ఇమేజ్ ని బాగా వాడుకొని జరగబోతున్న మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ సక్సెస్ సాధించడానికి మోడీ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అక్కడ స్థానికంగా ఎన్సీపీ, శివసేనలతో కలిసి బీజేపీ ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఎన్నికలకు ప్రచారం ప్రధానమైనది.. పైగా అక్కడ వాళ్ళు అనుకుంటున్నాంత రేంజ్ లో ప్రచారం సాగడం లేదు. లోకల్ గా ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ తో పాటు కొన్ని నాయకత్వ సమస్యలు కూడా అక్కడక్కడ నియోజకవర్గాలలో ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అందుకని ఇప్పుడు సరికొత్తగా పక్క రాష్ట్రాల లో ముఖ్యమంత్రులుగా ఉన్న తమ పార్టీ నేతలను మహారాష్ట్రలో మోహరించడానికి మోడీ ప్రయత్నిస్తున్నారు. అయితే మహారాష్ట్రతో మనకేంటి పని అనుకుంటున్నారా..
అక్కడ కూడా తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్న జిల్లాలు కొన్ని ఉన్నాయి. ఇక అక్కడ నాయకత్వ కొరత తీర్చడం కోసం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని బరిలోకి దింపబోతున్నారు. మరోపక్క ఆంధ్ర నుంచి ఇటు పురంధరేశ్వరి, అటు సోము వీర రాజు కూడా తరచుగా మహారాష్ట్ర ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. అయితే నిజానికి వీరిద్దరి కంటే కూడా చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి అక్కడ ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అందుకే వారి ఇమేజ్ ని అక్కడ వాడుకొని ఎన్నికల్లో గెలవడానికి మోదీ స్కెచ్ వేశారు.
ఇటు కాంగ్రెస్ కూడా తగ్గేదే లేదు అన్నట్టు భారీ ఎత్తున పార్టీ నేతలను ఊహరించి ప్రచారాన్ని సాగిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలో విపరీతమైన క్రైస్ట్ తెచ్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులు ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు. దీంతో వీరిద్దరికీ అడ్డుకట్ట వేయడానికి బాబు పవన్ జోడిలను దింపడానికి బీజేపీ ఫిక్సయింది. ఈ నేపథ్యంలో మోడీ స్వయంగా ఈ ఇద్దరికీ ఆహ్వానం పంపి ఈనెల 16, 17 తేదీలలో వారి మహారాష్ట్ర ప్రచారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అనుకున్నట్టు బీజేపీ మహారాష్ట్రలో గెలిస్తే ఒకరకంగా ఆ క్రెడిట్ మొత్తం ఇద్దరికే దక్కుతుందేమో.