ASBL NSL Infratech

వెండితెర అరంగేట్రానికి మోక్షు రెడీ

వెండితెర అరంగేట్రానికి మోక్షు రెడీ

నంద‌మూరి బాల‌కృష్ణ కొడుకు మోక్ష‌జ్ఞ వెండితెర అరంగేట్రం కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తోంది. మోక్ష‌జ్ఞ యాక్టింగ్ లో శిక్ష‌ణ పూర్తి చేసుకుని పూర్తి మేకోవ‌ర్ తో సిద్ధ‌మయ్యాడ‌ని టాక్. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో మోక్షు కొత్త లుక్ ఒక‌టి వైర‌ల‌వుతుంది.

ఈ ఏడాదిలోనే మోక్ష‌జ్ఞ‌ను లాంచ్ చేయాల‌ని బాల‌య్య ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ప‌లువురితో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్ప‌టికీ ఇంకా ఫైన‌ల్ డెసిష‌న్ తీసుకోలేద‌ని తెలుస్తోంది. సొంత బ్యాన‌ర్ లో కాకుండా పెద్ద బ్యాన‌ర్ లో మోక్షుని ప‌రిచ‌యం చేయాల‌ని బాల‌య్య ఆలోచిస్తున్నాడ‌ట‌. అది కుద‌ర‌క‌పోతే మోక్ష‌జ్ఞ కోసం త‌న అక్క‌లైన బ్ర‌హ్మ‌ణి, తేజ‌స్విని సొంత బ్యాన‌ర్ లో త‌మ్ముడిని వెండితెర‌కు ప‌రిచయం చేయడానికి రెడీగా ఉన్నార‌ట‌.

ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ ఎంట్రీకి సంబంధించి డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. లేట‌యినా మోక్షు ఎంట్రీకి ఇదే స‌రైన టైమ్. ఓ వైపు బాల‌య్య ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు మంచి స్ట‌ఫ్ ఇస్తున్న‌ప్ప‌టికీ నంద‌మూరి అభిమానులు మాత్రం గ‌త కొన్నేళ్లుగా మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మోక్షు ఎంట్రీ త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని తెలుసుకుని ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తున్నారు.  

 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :