సబర్మతి రిపోర్ట్ చూడమంటున్న సీఎం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Mohan Yadav) తాజాగా తాను సబర్మతి రిపోర్ట్(Sabarmathi Report) సినిమా చూడబోతున్నానని, తమ పార్టీ నేతలు, మంత్రులు కూడా ఈ సినిమాను చూడాలని పిలుపునిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అరుదు. 2002లో దేశాన్ని కుదిపేసిన గోద్రా అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను కశ్మీర్ ఫైల్స్(Kasmir Files) లానే బీజేపీ ప్రాయోజిత సినిమాగా భావిస్తున్నారు.
గోద్రా అల్లర్లు జరిగిన టైమ్ లో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ(Narendra Modi) ఎంత అన్‌పాపులర్ అయ్యాడో అందరికీ తెలుసు. అయితే ఆ టైమ్ లో అసలేం జరిగిందో వాస్తవాలు చూపించే సినిమాగా సబర్మతి రిపోర్ట్‌ను బీజేపీ మద్దతుదారులు చెప్తున్నారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
గోద్రా సంఘటన ఓ చేదు అనుభవమని, దీని మీద కొన్ని రాజకీయ పార్టీలు చెత్త రాజకీయాలు చేసి వాస్తవాలను కప్పి పెట్టాయని, ఇప్పుడు సబర్మతి రిపోర్ట్ ద్వారా అసలు నిజాలు బయటికొస్తున్నాయని, త్వరలోనే ఈ సినిమాను తాను చూడనున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ధీరజ్ సర్నా(Dheeraj Sarna) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాసే(Vikranth Mase), రాశీ ఖన్నా(Raashi Khanna), రిధి డోగ్రా(Ridhi Dogra) కీలక పాత్రల్లో నటించారు.