ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎంపాక్స్.. కోవిడ్ బాబులాంటి వైరస్?

ఎంపాక్స్.. కోవిడ్ బాబులాంటి వైరస్?

ప్రపంచాన్ని కోవిడ్ తర్వాత అంతగా భయపెడుతున్న ప్రమాదకర వైరస్.. ఎంపాక్స్.. మెడికల్ పరిభాషలో మంకీపాక్స్ గా పిలుస్తున్నారు. ఇది ఆఫ్రికా తదితరదేశాల్లో విజృంభించి, అక్కడి నుంచి ఇతర దేశాలకు సైతం విస్తరిస్తోంది ప్రమాదకర వైరస్. దీంతో అంతర్జాతీయంగా ప్రకంపనలు రేపుతోంది. దీని గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం డేంజర్ బెల్స్ మోగించింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.

ఎంపాక్స్‌ వైరస్‌ ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తుండడం.. ఫిలిప్పైన్స్‌లో తొలి కేసు నమోదు కావడంతో భారత్‌ అప్రమత్తమైంది. విమానాశ్రయాలు, భారత్‌-బంగ్లాదేశ్‌, భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎంపాక్స్‌ లక్షణాలను గుర్తించాలని సూచించింది. దీంతో విమానాశ్రయాల్లో హైఅలెర్ట్‌ నెలకొంది. గతంలోనే ఈ వైరస్‌ ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసినా.. ఇప్పుడు విస్తరిస్తున్నది కొత్త వేరియంట్‌ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.

2022 నుంచి ఈ వేరియంట్‌ 116 దేశాల్లో 99,176 మందికి సోకిందని, వారిలో 208 మంది చనిపోయారని వివరించింది. ఒక్క కాంగోలోనే 15,600 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో.. ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా నేతృత్వంలో ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, రాష్ట్రాల సన్నద్ధతపై అంచనాలు వేసింది. ఒకవేళ ఎంపాక్స్‌ దేశంలోకి ప్రవేశిస్తే తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణను రూపొందించింది. ఎంపాక్స్‌ లక్షణాలున్నవారు, వ్యాధి నిర్ధారణ అయిన వారిని క్వారంటైన్‌ చేయడానికి ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా, సఫ్దార్‌జంగ్‌, లేడీ హార్డింగే ఆస్పత్రులను ఎంపిక చేసింది.రాష్ట్రాలు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంపాక్స్‌ చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సూచించింది. మరోవైపు.. 2022 నుంచి 30 దాకా కేసులు భారత్‌లో నమోదైనట్లు సమాచారం.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :