ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆయ్‌ సినిమా సంగీత దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది : అజయ్‌ అరసాడ

ఆయ్‌ సినిమా సంగీత దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది : అజయ్‌ అరసాడ

సంగీత దర్శకుడిగా అన్ని జోనర్‌ సినిమాలు చేయాలని వుంది. చిన్నప్పటి నుంచి కమర్షియల్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. కమర్షియల్‌ సినిమాలకు సంగీతం అందించాలనేది నా కోరిక. సంగీతాన్ని ట్రెండీగా.. కమర్షియల్‌గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇటీవల విడుదలైన 'ఆయ్‌' సినిమా నాకు సంగీత దర్శకుడిగా మంచి పేరును తీసుకొచ్చింది' అన్నారు సంగీత దర్శకుడు అజయ్‌ అరసాడ. ఇటీవల విడుదలైన ఆయ్‌ చిత్రానికి మూడు పాటలు, నేపథ్య సంగీతం అందించాడు ఈ యువ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా విజయపథంలోకి దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా అజయ్‌ అరసాడతో జరిపిన ఇంటర్వ్చూ ఇది.

సంగీతంలో ఎక్కడా శిక్షణ పొందారు?

సంగీతంలో నేను ఎక్కడ శిక్షణ పొందలేదు.  మాది సంగీత నేపథ్యం వున్న కుటుంబం కావడంతో సొంతంగా నేర్చుకున్నాను.  చిన్నప్పటి నుంచి గిటార్‌ ప్లే చేసేవాడిని. మొదట్లో షార్ట్‌ఫిల్మ్స్‌కు సంగీతం అందించేవాడిని మరో వైపు టీసీఎస్‌లో సాఫ్టవేర్‌ ఇంజనీర్‌గా జాబ్‌ చేసేవాడిని  2014లో 'జగన్నాటకం' అనే  సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాను. ఇక 2018లో జాబ్‌ వదిలేసి పూర్తిగా  దృష్టి సినిమాలపై పెట్టాను. ఆ తరువాత కిరాక్‌, నేడే విడుదల, క్షీరసాగర మదనం, శ్రీరంగ నీతులు, మిస్సింగ్‌ చిత్రాలకు సంగీత దర్శకుడిగా చేశాను.  తాజాగా ఆయ్‌ సినిమాలో మూడు పాటలకు సంగీతంతో పాటు నేపథ్య సంగీతం అందించాను.

ఆయ్‌ సినిమా మీకు ఎలాంటి పేరు తీసుకొచ్చింది?

ఆయ్‌ సినిమాలో మూడు పాటలు, నేపథ్య సంగీతం చేశాను. ఆయ్‌ అనేది లెటెస్ట్‌ సక్సెస్‌, సినిమా పరంగా, సంగీత పరంగా చాలా మంచి పేరు వచ్చింది. ఐటెమ్‌సాంగ్‌, ప్రీక్లైమాక్స్‌ సాంగ్‌, టైటిల్‌ సాంగ్‌కు సంగీతం అందించాను. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగా చేశావనే పేరు వచ్చింది. ఆయ్‌ సినిమా వల్ల నాకు ఎక్కువ ఎక్స్‌పోజర్‌ వచ్చింది. పతాక సన్నివేశాల బీజీఎమ్‌కు కూడా ఎక్కువ అప్లాజ్‌ వస్తుంది.  

ఆయ్‌ చిత్రానికి మీరందుకున్న బెస్ట్‌ కాంప్లిమెంట్‌?

నిర్మాత బన్నీవాస్‌ నీ నేపథ్య సంగీతం వల్ల అందరూ సినిమా చూసే విధానం మారిపోయింది. పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా ప్లస్‌ అయ్యింది అన్నారు.

సంగీత దర్శకుడిగా మీ ప్లస్‌ ఏమిటని అనుకుంటున్నారు?

సాంగ్స్‌ అండ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇస్తే పూర్తిగా అంకితభావంతో ఇంకా మంచి అవుట్‌పుట్‌ ఇస్తాననే నమ్మకం వుంది. ఇక నాకు నేపథ్య సంగీతం నాకు చాలా ఆసక్తి. నా శక్తి కూడా అదే. సేవ్‌ దటైగర్స్‌కు నేపథ్య సంగీతం, ఒక పాట చేశాను. మొదటి సీజన్‌ గురించి ఎవరూ మాట్లాడలేదు. రెండో పార్ట్‌లో నేపథ్య సంగీతం వల్ల  ఎమోషన్స్‌ బాగా క్యారీ అయ్యింది. కామెడీ సినిమాలకు నేపథ్య సంగీతం అందించడం మంచి సంతృప్తి వస్తుంది.
మీకు ఏ జోనర్‌ సినిమాలకు సంగీతం అందించాలని వుంది.

నాకు అన్ని జోనర్‌లు చేయాలని వుంది. చిన్నప్పటి నుండి కమర్షియల్‌ సినిమాలు చూసి చూసి నాబ్లడ్‌లో ఆ సినిమా మమేకం అయింది. కమర్షియల్‌ సినిమాలక సంగీతం అందిచండం నాకు చాలా ఇంట్రెస్ట్‌. కమర్షియల్‌ సినిమాలు చేయడం  నా టార్గెట్‌,. కమర్షియల్‌ సినిమాలకు   ట్రెండీగా  మ్యూజిక్‌ ఎలా చేయాలనేది రకరకాలుగా ఆలోచిస్తాను. నా బీజీఎమ్‌ను హమ్‌ చేసుకుంటేనే ఆ బీజీఎమ్‌ హిట్‌ అనేది నా నమ్మకం. కామెడీ కూడా కమర్షియల్‌ జోనర్‌లోనే వుంటుంది. మన మైండ్‌లో వున్న ఎమోషన్‌ను సంగీతంగా మలచడం పెద్డ టాస్క్‌. దానికి ప్రాక్టికల్‌ ఇంప్లిమెంట్‌ అనేది ముఖ్యం. ఈ విషయంలో నేను చాలా పర్‌ఫెక్ట్‌గా వుంటాను. ఇంకా మెలోడి ట్యూన్స్‌ కూడా నేను బాగా చేస్తానని అందరూ అంటుంటారు.

మీ ట్యూన్‌ లిరిక్స్‌ను డామినేట్‌ చేయకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి?

నేను ఈ విషయంలో  దేవిశ్రీప్రసాద్‌ ఫ్యాన్‌ని. లిరిక్‌కు ట్యూన్‌ కనెక్ట్‌ అయితే ఆ సాంగ్‌ కలకాలం గుర్తుంటుంది అనేది ఆయన పాలసీని ఫాలో అవుతాను. మెలోడికి ఇంపార్టెంట్‌ ఇస్తాను.

నేపథ్య సంగీతం విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? 

ఎమోషన్‌ ఇంపార్టెంట్‌.. ఎమోషన్‌ వుంటేనే నేపథ్య సంగీతం హైలైట్‌ అవుతుంది. ఎమోషన్‌ను నేపథ్య సంగీతం మరో లెవల్‌కు తీసుకెళుతుందనేది నా నమ్మకం.

సంగీత దర్శకుడిగా మీ లక్ష్యం ఏమిటి?

ఆయ్‌ చిత్రం విజయంతో ఒక మెట్టు ఎక్కాను. ఆయ్‌లో కామెడీ, సెంటెమెంట్‌ ఇలా ఆల్‌ ఎమోషన్స్‌ వున్న సినిమా చేయగలను అని ప్రూవ్‌ అయ్యింది. మంచి కాన్సెప్ట్‌తో కూడిన కథకు సంగీతం చేసే అవకాశం వస్తే సంగీత దర్శకుడిగా సంతృప్తి లభిస్తుంది. కమర్షియల్‌ సినిమాలు చేయాలనేది నా లక్ష్యం. నా  లెవల్‌లో వున్న సంగీత దర్శకుడికి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో  ఆ అవకాశం కనిపిస్తుంది. అలాంటి సినిమాల కోసం వెయిటింగ్‌. అవి చేయగల సత్తా వుందనేది నా నమ్మకం. ప్రస్తుతం వికటకవి అనే వెబ్‌సీరిస్‌, రాజమండ్రీ రోజ్‌ మిల్క్‌ అనే ప్రేమకథ ఆచిత్రానికి సంగీతం అందిస్తున్నాను. ఈ సినిమా మంచి క్యూట్‌ లవ్‌స్టోరీ. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :