అన్ని ఓకే అయితే ఓటీటీ లో చైతు పెళ్లి..
ఒకప్పుడు సినిమాలు టీవీలో ప్రసారం అవ్వాలి అంటే సంవత్సరాలా టైం పట్టేది. ఏ పండుకో బ్లాక్ బస్టర్ సినిమాలు అప్పుడప్పుడు వచ్చేవి. అయితే ఓటీటీ వచ్చిన తర్వాత నుంచి ఈ పద్ధతులు చాలా వరకు మారిపోయాయి.. కొత్త సినిమా ఏదైనా ఒక నెల రెండు నెలల లోపే ఆన్లైన్ లోకి వచ్చేస్తోంది. నచ్చనన్నిసార్లు చూసే వసతి కూడా ఉంటుందో.. దీంతో ఓటీటీ లపై క్రేజ్ బాగా పెరిగింది. అయితే ఇప్పుడు ఈ సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి సెలబ్రిటీలకు పెళ్లిలను డాక్యుమెంటరీలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తాజాగా నయనతార కు సంబంధించి ఓ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు అక్కినేని కుటుంబానికి సంబంధించిన పెళ్లి ప్రోగ్రాం కూడా ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యే ఆస్కారం కనిపిస్తోంది. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియో సాక్షిగా నాగచైతన్య, శోభిత ధూళిపాల ఒకటి కాబోతున్నారు. అయితే ఈ పెళ్లి ఎటువంటి ఆడంబరాలకు తావు లేకుండా ఎంతో సింపుల్ గా జరుగుతోంది.
డెస్టినేషన్ వెడ్డింగ్స్ తో బోర్ కొట్టిన సెలబ్రిటీలు ఇప్పుడు సింపుల్ వెడ్డింగ్స్ కే పెద్ద పీట వేస్తున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లిని జరుపుకుంటున్నారు. మరి ముఖ్యంగా అక్కినేని కుటుంబంలో సమంత, నాగచైతన్య వివాహం ఏ రేంజ్ లో జరిగిందో అందరికీ తెలుసు. మరోపక్క అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ కూడా భారీగానే జరిపించారు. రెండు అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆర్భాటాలకు దూరంగా ఉండడానికి అక్కినేని ఫ్యామిలీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.
అయితే ఈ పెళ్లిని అభిమానులు ఎక్కడ చూడాలి.. ఈ సమస్యకు పరిష్కారంగా పలు ఓటీటీ సంస్థలు వీళ్ళ పెళ్లిని డాక్యుమెంటరీగా తీయడానికి ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. వీరి ప్రేమ కథ దగ్గర నుంచి పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కే వరకు వచ్చింది సినిమా రూపంలో వస్తుందన్నమాట. అయితే దీనిపై అక్కినేని కుటుంబం ఎలా స్పందిస్తుంది అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే మాత్రం ఓటీటీ లో ఏం చెక్క ఈ ఇద్దరు పెళ్లి చూడవచ్చు. అంతేకాదు ఇప్పటివరకు అందరికీ ప్రశ్నార్థకంగా ఉన్న చైతు, సామ్ మధ్య ఏం జరిగింది, అసలు శోభిత చైతు లైఫ్ లోకి ఎప్పుడు వచ్చింది ఇలాంటి ప్రశ్నలకు కూడా ఈ డాక్యుమెంటరీ సమాధానం అయ్యే ఛాన్స్ ఉంది.