బాలయ్య షో లో దిల్ రాజు ప్యాంటు గోల
టాక్ షో లలో తన రూటే సపరేటనిపిస్తోంది ఆహా(Aha)లో బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్(Unstoppable). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టిన ఈ షో కి ఇప్పుడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) చీఫ్ గెస్టుగా వచ్చాడు. అతనితో పాటూ లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమాను తీసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri), హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), నిర్మాత నాగవంశీ(Naga Vamsi) కూడా షో కు హాజరయ్యారు.
ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ప్రోమో చాలా షార్ప్ గా బావుంది. ఈ మధ్య సంచలన కామెంట్స్ తో నెట్టింట బాగా పాపులరైన నాగవంశీ చేసిన కామెంట్స్ ఈ షోకు హైలైట్ అయ్యేలా అనిపిస్తోంది. బాలయ్య క్వశ్చన్స్ కు నాగవంశీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు. తనకు నచ్చని డ్రెస్సింగ్ స్టైల్ గురించి అడిగితే దిల్ రాజు(Dil Raju) అప్పుడప్పుడు వేసుకునే పింక్ ప్యాంట్ తనకు నచ్చదని, అది వద్దని ఆయనకు చెప్పాలనుకుంటున్నట్లు చెప్పాడు.
అంతేకాదు వెంకీ అట్లూరికి పూజా(Pooja Hegde) పై ఎప్పటినుంచో కన్నుందని, ఆమెతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడని కూడా కామెంట్ చేశాడు వంశీ. మొత్తం ఎపిసోడ్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా ఈ నెల 31 రాత్రి నుంచి ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.