ఏఎన్నార్ బయోపిక్ పై నాగ్ మాట
తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి తెలియేచేసేలా చేసిన లెజెండ్స్ జీవిత కథలను తెరపై చూపించే ప్రయత్నం మహానటి(Mahanati)తో మొదలైంది. ఆ సినిమా హిట్ అవడంతో బాలకృష్ణ(Balakrishna) ఎంతో కష్టపడి, ఖర్చు పెట్టి తన నాన్న స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్(Sr. NTR) బయోపిక్ ను రెండు భాగాలుగా తీసినప్పటికీ ఆ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకోలేకపోయింది.
ఆ సినిమా తగినంత డ్రామా లేకపోవడం వల్లే ఫ్లాప్ అయిందనేది అందరికీ తెలుసు. దీంతో ఎవరూ హీరోలపై బయోపిక్ తీసే సాహసం చేయలేకపోయారు. ఇలాంటి టైమ్ లో నాగార్జున(nagarjuna) దగ్గర ఏఎన్నార్(ANR) బయోపిక్ గురించి ప్రస్తావన రాగా, నాన్నగారి బయోపిక్ బోరింగ్ గా ఉండే ఛాన్సుందని, కెరీర్ స్టార్టింగ్ లో ఎత్తుపల్లాలు చూసిన తర్వాత ఎక్కడమే కానీ దిగడం తెలియనంత గొప్పగా ఆయన జర్నీ సాగిందని నాగ్ వెల్లడించారు.
సినిమా బదులు డాక్యుమెంటరీ అయితే బావుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఏవైనా అంశాలు కల్పిస్తే తప్ప బయోపిక్స్ వర్కవుట్ అవవని, కానీ తనకు ఆ ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టి చెప్పాడు నాగార్జున. మాట వరసకు కూడా చేస్తామని చెప్పకుండా నాగ్ ఇంత ఓపెన్ గా నిజాన్ని ఒప్పుకోవడం చూస్తుంటే తను ఎంత ప్రాక్టికల్ గా ఆలోచించాడో అర్థమవుతుంది. దానికి తోడు ఇప్పటికే ఏఎన్నార్ పై చాలా పుస్తకాలొచ్చాయి. ఆయన కూడా స్వయంగా అనుభవాలు పంచుకున్న వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి నాగ్ వీటిని డాక్యుమెంటరీగా చేస్తే భావితరాలకు ఓ రిఫరెన్స్ గా ఏఎన్నార్ డాక్యుమెంటరీ నిలిచిపోతుంది. నాగ్ మాటల్ని బట్టి ఏఎన్నార్ బయోపిక్ తెరకెక్కనట్టే అనుకోవాలి.