ASBL Koncept Ambience
facebook whatsapp X

కొడుకుల పెళ్లి విష‌యంలో నాగ్ క్లారిటీ

కొడుకుల పెళ్లి విష‌యంలో నాగ్ క్లారిటీ

చాలా త‌క్కువ గ్యాప్ లోనే త‌మ ఫ్యామిలీకి సంబంధించిన రెండు గుడ్‌న్యూస్‌ల‌ను అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వెల్ల‌డించాడు. త‌న ఇద్ద‌రు కొడుకులు నాగ‌చైత‌న్య‌(naga chaitanya), అఖిల్(Akhil) పెళ్లిళ్ల విష‌యంలో నాగ్ ఎంత‌గానో ఎదురుచూస్తున్నాడు. డిసెంబ‌ర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) లో నాగ చైత‌న్య‌, శోభిత ధూళిపాళ్ల(Sobhitha Dhulipalla) పెళ్లి జ‌ర‌గ‌నున్న అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. 

ఈ పెళ్లి జ‌రిగేలోపే నాగార్జున, అఖిల్ ఎంగేజ్‌మెంట్ విష‌యాన్ని అనౌన్స్ చేశాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ డ‌బుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ రెండు వేడుక‌లుఒకేసారి జ‌రుగుతాయ‌ని నిన్న‌టి నుంచి ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలో ఆ వార్త‌ల్ని నాగ్ కొట్టిపారేశాడు. ముందు చైతూ(chaithu) పెళ్లయ్యాక వ‌చ్చే ఏడాది ఆరంభంలో అఖిల్ పెళ్లి జ‌రిపించేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. 

హిందూ సంప్రదాయంలో అన్న‌ద‌మ్ములు పెళ్లిళ్లు మంచిది కాద‌ని ఒకేసారి చేయ‌రు. అందుకే చైతూ, అఖిల్ పెళ్లి వేర్వేరుగా చేయ‌నున్నారు. అంతేకాదు చైతూ పెళ్లి హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ రూ.50 కోట్ల‌కు తీసుకుంద‌నే ప్ర‌చారానికి కూడా నాగ్ చెక్ పెట్టాడు. అయితే అఖిల్ పెళ్లి ఎప్పుడు, ఎక్క‌డ జ‌ర‌గ‌నుంద‌నే వివవాలు మాత్రం తెలియాల్సి ఉంది.  

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :