ASBL Koncept Ambience
facebook whatsapp X

కూలి కోసం నాగ్ రికార్డు రెమ్యూన‌రేష‌న్

కూలి కోసం నాగ్ రికార్డు రెమ్యూన‌రేష‌న్

ర‌జినీకాంత్, లోకేష్ క‌న‌గ‌రాజ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కూలి. లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స్ లో భాగంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా క‌థ, క‌థ‌నం కొత్త‌గా ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం అన్ని భాష‌ల నుంచి క్యాస్టింగ్ ను తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే కూలి సినిమాలో శృతి హాస‌న్, స‌త్య‌రాజ్, ఉపేంద్ర, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
 
రీసెంట్ గా నాగ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెస్ తెలియ‌చేస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. స‌న్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సైమ‌న్ అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున రెమ్యూన‌రేష‌న్ గురించి నెట్టింట ఆస‌క్తిక‌ర ప్ర‌చారం న‌డుస్తోంది. కూలిలో నాగ్ విల‌న్ గా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

ఈ పాత్ర కోసం నాగ్ ఏకంగా రూ.24 కోట్ల రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. నాగ్ కెరీర్లో ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ రెమ్యూనరేష‌న్ గా రూ.18 కోట్లు తీసుకున్నాడు. కూలి సినిమాలో నాగ్ క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్ఫుల్ గా ఉంటుంద‌ని, అందుకే అంత మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ ఇచ్చార‌ని టాక్. ఇందులో నిజానిజాలేంట‌నేది తెలియాల్సి ఉంది. నిజంగా నాగ్ అంత మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటే మాత్రం రికార్డ‌నే చెప్పాలి.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :