ASBL Koncept Ambience
facebook whatsapp X

నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు సమన్లు

నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు సమన్లు

టాలీవుడ్ స్టార్ నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. నాగచైతన్య, సమంత విడాకులపై కొన్నిరోజుల క్రితం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. మంత్రికి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు జరిగే విచారణకు మంత్రి హాజరు కావాలని ఆదేశించింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. ఈ రెండు కేసుల్లోనూ పిటిషనర్ల వాదనలను కోర్టు రికార్డు చేసింది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :