ASBL NSL Infratech
facebook whatsapp X

ఒకే రూటులో నాని, ఫ‌హ‌ద్

ఒకే రూటులో నాని, ఫ‌హ‌ద్

ర‌జనీకాంత్ సినిమాలో ఆఫ‌ర్ వ‌స్తే ఎవ‌రైనా వ‌ద్ద‌నుకుంటారా?  కానీ ఇలా ఇద్ద‌రు న‌టులు ర‌జనీ సినిమాలో వ‌చ్చిన ఆఫ‌ర్ ను వ‌దులుకున్నారు. ఇది విన‌డానికి షాకింగ్ గా అనిపించినా నిజం. ప్ర‌స్తుతం ర‌జినీకాంత్, లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కూలి అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో మొద‌లైంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో పుష్ప లో భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ గా న‌టించి మెప్పించి ఫ‌హ‌ద్ ఫాసిల్ కు ఓ కీల‌క పాత్ర ఆఫ‌ర్ చేశాడ‌ట డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్. కానీ ఆ అవ‌కాశాన్ని ఫ‌హ‌ద్ వ‌దులుకున్న‌ట్లు తెలుస్తోంది. వెట్ట‌యాన్ లో చాలా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర చేయ‌డంతో మ‌ళ్లీ దానికంటే త‌క్కువ స్థాయి పాత్ర‌ను కూలిలో చేయ‌లేన‌ని త‌న‌కు ఆఫ‌ర్ ఇచ్చిన లోకేష్ కు ఫ‌హ‌ద్ సున్నితంగా నో చెప్పాడ‌ట‌.

అయితే గ‌తంలో నాని కి కూడా ర‌జనీకాంత్ వెట్ట‌యాన్ లో ఆఫ‌ర్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కానీ పాత్ర‌కు ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో నాని ఆ ఆఫ‌ర్ ను కాద‌న్నాడు. దీంతో ఆ పాత్ర రానా ద‌గ్గుబాటి ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. ఇలా ముందు నాని, త‌ర్వాత ఫ‌హ‌ద్ ఇద్ద‌రూ ర‌జ‌నీ సినిమాల్లో న‌టించేందుకు నో చెప్పారు. వారి పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేక‌పోవడం వ‌ల్లే వారిద్ద‌రూ ఈ ఆఫ‌ర్లను రిజెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.  

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :