ASBL NSL Infratech

రిస్క్ చేస్తున్న నాని నిర్మాత‌

రిస్క్ చేస్తున్న నాని నిర్మాత‌

 

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో స‌రిపోదా శ‌నివారం సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఆగ‌స్ట్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత నాని త‌న‌కు ద‌స‌రా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల‌తో మ‌రో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమా గురించి ప్ర‌స్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాకు దాదాపు రూ.120 కోట్ల బ‌డ్జెట్ ను కేటాయించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. నాని మార్కెట్ కు ఇది చాలా ఎక్కువ బ‌డ్జెట్. థియేటర్, ఓటీటీ క‌లిపినా ఈ రేంజ్ క‌లెక్ట్ చేయ‌డం చాలా క‌ష్టం. కానీ నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమా విష‌యంలో భారీ రిస్క్ కు రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది.

యూనిట్ స‌భ్యులు చెప్తున్న దాన్ని బ‌ట్టి ఈ సినిమా సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో జ‌ర‌గ‌నుంద‌ట‌. పీరియాడిక్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న సినిమా కాబ‌ట్టి దానికి అవ‌స‌ర‌మైన సెట్స్ ను ప్ర‌స్తుతం భారీ ఎత్తున నిర్మిస్తున్నార‌ట‌. ఈ ప‌నుల‌న్నింటినీ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమాకు ఇంత భారీ మొత్తంలో ఖ‌ర్చు పెట్ట‌డానికి రీజ‌న్ ద‌స‌రా సినిమా ఇచ్చిన రిజల్టే అని తెలుస్తోంది. పైగా స‌రిపోదా శ‌నివారం త‌ర్వాత నాని మార్కెట్ భారీ స్థాయిలో పెరుగుతుంద‌ని అంద‌రూ అంటున్నారు. వీట‌న్నింట‌నీ లెక్క‌లోకి తీసుకునే నాని మీద ఈ రేంజ్ బ‌డ్జెట్ కు నిర్మాత రెడీ అయ్యాడ‌ని తెలుస్తోంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :