ASBL Koncept Ambience
facebook whatsapp X

నాని, శ్రీకాంత్ ఓదెల #NaniOdela 2 మాస్ మ్యాడ్‌నెస్ బిగెన్స్  

నాని, శ్రీకాంత్ ఓదెల #NaniOdela 2 మాస్ మ్యాడ్‌నెస్ బిగెన్స్  

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని మరో హైలీ యాంటిసిపేటెడ్ మూవీకి రెడీ అయ్యారు. ఫస్ట్ కొలాబరేషన్ 'దసరా'తో100 కోట్లకు పైగా వసూలు చేసిన ఘన విజయం తరువాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం మళ్లీ చేతులు కలిపారు.

నాని-ఓదెల 2, దసరా ఇంపాక్ట్ ని 100 రెట్లు క్రియేట్ చేస్తుందనే  శ్రీకాంత్ ఓదెల స్టేట్మెంట్ తో సినిమాపై ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. రీసెంట్ గా షూట్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో నుండి బిహైండ్ స్నాప్‌ను షేర్ చేసిన దర్శకుడు, అద్భుతమైన ప్రోడక్ట్ ని అందించడానికి తన కమిట్మెంట్ ని చూపించారు.

"మార్చి 7, 2023 - నా ఫస్ట్ సినిమా #దసరాకి నేను చెప్పిన చివరి "కట్, షాట్ ఓకే." సెప్టెంబర్ 18, 2024 - #NaniOdela2 అనౌన్స్‌మెంట్ వీడియో కోసం మళ్ళీ "యాక్షన్" చెప్పాను. 48,470,400 సెకన్లు గడిచాయి! ప్రతి సెకను నా నెక్స్ట్ కోసం సిన్సియర్ గా వున్నాను. #NaniOdela2 ❤️❤️❤️ @NameisNani అన్న @SLVCinemasOffl #దసరా ప్రభావాన్ని 100 రెట్లు క్రియేట్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను, ”అని శ్రీకాంత్ ఓదెల అన్నారు.

నాని తన రెస్పాన్స్ తో అభిమానులని అలరించారు "ఇతని మ్యాడ్ నెస్ నా జీవితంలోకి తిరిగి వచ్చింది. Be prepared to be blown away' అని అన్నారు. #NaniOdela2 నానిని ఎక్స్ ట్రార్డినరీ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేస్తూ, యూనిక్ అండ్ ఎక్సయిటింగ్ నెరేటివ్ తో గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది.

ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని గ్రాండ్ నిర్మించనున్నారు, ఇది నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరికీ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ.
 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :