ASBL Koncept Ambience
facebook whatsapp X

బ్రాహ్మణి రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నారా భువనేశ్వరి..

బ్రాహ్మణి రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నారా భువనేశ్వరి..


తెలుగుదేశం పార్టీని (Telugu Desam) స్థాపించింది నందమూరి తారక రామారావు (NTR) .. అయితే ప్రస్తుతం ఆ పార్టీ పగ్గాలు ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు ( Chandra Babu) చేతుల్లో ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లకు ఎప్పటినుంచో ఎన్టీఆర్ కుటుంబం నుంచి టీడీపీ వారసులు వస్తే బాగుంటుంది అన్న ఆశ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) రాజకీయ రంగ ప్రవేశం తో పాటు బాలకృష్ణ పెద్ద కూతురు.. నారా వారి కోడలు అయిన బ్రాహ్మణి (Brahmani) రాజకీయ రంగ ప్రవేశంపై కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 

2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బ్రాహ్మణి (Brahmani) విజయవాడ ఎంపీ లేదా గుంటూరు స్థానం నుంచి పోటీ చేస్తారు అని జోరుగా ప్రచారం సాగింది. అయితే బ్రాహ్మణి మాత్రం కేవలం ప్రచారానికి పరిమితమయ్యారే తప్ప ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేదు. అయినా ఎప్పటికప్పుడు ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి ఆడపడుచు.. బ్రాహ్మణి అత్త భువనేశ్వరి ( Nara Bhuvaneswari) ఆమె రాజకీయ రంగ ప్రవేశం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

హెరిటేజ్ సంస్థానాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపిస్తున్న బ్రాహ్మణికి ప్రత్యక్ష రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు అని ఆమె అత్త తేల్చి చెప్పారు. ఆమె కేవలం వ్యాపారం చేసుకోవడం.. ఇండిపెండెంట్గా ఎదగడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని.. రాజకీయాలపై పెద్ద ఆసక్తి లేదు కాబట్టి ఎప్పటికీ రాజకీయాలలోకి రాబోరని భువనేశ్వరి స్పష్టం చేశారు. 2019 ఎన్నికల సమయంలో దూకుడు ప్రదర్శించిన బ్రాహ్మణి (Brahmani) మంగళగిరి నియోజకవర్గంలో నుంచి తన భర్త కోసం ప్రచారం నిర్వహించారు. అనంతరం చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా టీడీపీ శ్రేణులకు ఉత్తేజపరుస్తూ.. రాష్ట్రస్థాయిలో చంద్రబాబు అరెస్టు ( Chandrababu arrest) వ్యతిరేకంగా సాగిన నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించారు.

మొన్న ఎన్నికల సమయంలో కూడా మంగళగిరి నియోజకవర్గంలో భర్త గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో కష్టపడి పని చేశారు. ఇలా లోకేష్ రాజకీయ ఎదుగుదలలో తన వంతు పాత్ర పోషించిన బ్రాహ్మణి రాజకీయాలలోకి వస్తే బాగుంటుంది అని ఎందరో భావించారు. అయితే ఆమెకు రాజకీయాలు ఇష్టం లేవు అని భువనేశ్వరి వెల్లడించడం కొందరికి నచ్చడం లేదు. బ్రాహ్మణి రాజకీయాలలోకి వస్తే లోకేష్ ( Nara Lokesh) కి పోటీగా అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఆమెకు ఇంట్రెస్ట్ లేదని అంటున్నారు అని కూడా కొందరు భావిస్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :