ASBL NSL Infratech
facebook whatsapp X

పదవిలో ఉన్నప్పుడు కేవలం రెండు.. కానీ ఇప్పుడు మాత్రం ఐదు.. జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన లోకేష్..

పదవిలో ఉన్నప్పుడు కేవలం రెండు.. కానీ ఇప్పుడు మాత్రం ఐదు.. జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన లోకేష్..

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద శుక్రవారం నాడు నారా లోకేష్ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఢిల్లీలో మాట్లాడుతున్నవన్నీ అసత్యాలే అని చెప్పిన లోకేష్.. అసెంబ్లీకి హాజరై ఉంటే తాము అతనికి వాస్తవాలు ఏమిటో వివరించి చెప్పే వాళ్ళమని ఎద్దేవా చేశారు. వైసిపి నేతలలో మాట్లాడినట్టు అసభ్యకరమైన పదజాలం కూటమినేతను వాడరని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జగన్ ను ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినప్పటికీ ఇంకా అతను ప్రభుత్వం పై విమర్శలు, ఆరోపణలు చేయడం మానుకోలేదని.. ఇప్పటికే ఐదు ప్రెస్‌మీట్లు పెట్టారని లోకేష్ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో రెండు ప్రెస్‌మీట్లు మాత్రమే పెట్టిన జగన్ ఈనాడు అధికారం కోల్పోయిన తర్వాత 50 రోజులలోనే ఐదు ప్రెస్‌మీట్లు పెట్టారని లోకేష్ దేవ చేశారు.

ప్రస్తుతం నారా లోకేష్ రెడ్ బుక్ పై జరుగుతున్న డిస్కషన్ నేపథ్యంలో తనపై వచ్చిన వ్యాఖ్యల గురించి ఆయన స్పందించారు. తన వద్ద ఉన్న రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ గల్లీలలో గగ్గోలు పెడుతున్నాడని ఆయన విమర్శించారు. తన వద్ద రెడ్ బుక్ ఉంది అన్న విషయం తానే స్వయంగా ఎన్నోసార్లు వెల్లడించాలని.. తప్పు చేసిన వారి పేర్లు ఆ పుస్తకంలో పొంది పరిచానని లోకేష్ వివరించారు. అయితే వారిని కేవలం చట్టపరంగా మాత్రమే శిక్షిస్తాము అన్న విషయాన్ని తాను ఇదివరకే చాలా సార్లు స్పష్టం చేసినట్లు లోకేష్ మళ్లీ ఒకసారి గుర్తు చేశారు. తాను ఇప్పటికీ కూడా అదే మాటకి కట్టుబడి ఉన్నానని.. జగన్ చేస్తున్నవన్నీ అసత్య వ్యాఖ్యలని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలో కూర్చుని జగన్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతినిందని.. వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.. ఇది కేవలం ఆయన కుట్ర మాత్రమే. రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందింది కాబట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులలో 36 హత్యలు జరిగాయి అని చెబుతాడే తప్ప ఆ పేర్లు మాత్రం ఎందుకు చెప్పడు.. అని లోకేష్ ప్రశ్నించారు. కేవలం అసెంబ్లీ సమావేశాలలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డుమ్మా కొట్టడానికి ఈ డ్రామా ఆడుతున్నాడని లోకేష్ ఆరోపించారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :