పిల్లలకు అర్థమయ్యేలా ‘బాలల భారత రాజ్యాంగం’ తీసుకురావాలి: నారా లోకేశ్
భారత రాజ్యాంగం చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వచ్చే ఏడాది నుంచి ప్రతి విద్యార్థికి బాలల భారత రాజ్యాంగం అందజేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏపీ సెక్రటేరియట్లో నిర్వహించిన 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్.. 1949 నవంబర్ 26న ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రాజ్యాంగ రూపకర్తలను అందరం స్మరించుకోవాలన్న ఆయన.. పిల్లలు, పెద్దలు అందరికీ అర్థమయ్యేలా రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలే భారత భవిష్యత్తు అని చెప్పారు.
Tags :