ASBL Koncept Ambience
facebook whatsapp X

సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లతో మంత్రి నారా లోకేష్ భేటీ

సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లతో మంత్రి నారా లోకేష్ భేటీ

డాటా సేవలరంగ పెట్టుబడులకు విశాఖలో అనుకూల వాతావరణం

గ్లోబల్ టెక్ హబ్ గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టండి

శాన్ ఫ్రాన్సిస్కో (యుఎస్ఎ): సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో రాష్ట్ర విద్య, ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వారికి వివరించారు. సేల్స్ ఫోర్స్ కార్యకలాపాల గురించి వారు వివరిస్తూ... సేల్స్‌ఫోర్స్ కంపెనీ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (CRM) , క్లౌడ్-ఆధారిత సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్ గా ఉంది. కస్టమర్ ఇంటరాక్షన్‌లు, సేల్స్ అండ్ సర్వీస్ ఆపరేషన్లను నిర్వహించడానికి సాధికారత కల్పించే సాధనాలను సరఫరా చేస్తుంది. సేల్స్ ఫోర్స్ యొక్క కస్టమర్ 360, ఐన్ స్టీన్ ఎఐ వంటి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్, అప్ డేటేడ్ అప్లికేషన్లలో సేల్స్ ఫోర్స్ పురోభివృద్ధి సాధిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సేల్స్ ఫోర్స్ మార్కెట్ క్యాప్ $224.14 బిలియన్ డాలర్లు ఉండగా, ఆదాయం $36.46 బిలియన్ డాలర్లుగా నమోదైందని సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని తెలిపారు.

మంత్రి లోకేష్ మాట్లాడుతూ...  ఇ-గవర్నెన్స్, పబ్లిక్ సెక్టార్ లలో ఎఐ, క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించాలన్నది మా లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా CRM సొల్యూషన్‌లు, ఎఐ-డ్రైవెన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరుతున్నాం. డాటా సేవల రంగానికి అనువైన వాతావరణ కలిగిన విశాఖపట్నంలో ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటుచేయండి. గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఎపిలో సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఎఐ సొల్యూషన్లను సమగ్రపరచడం వంటి సేవలు మాకు ఉపకరిస్తాయి. ఎపిలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సేల్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :