ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.. ఏ ఒక్కరినీ విడిచిపెట్టదు : లోకేశ్
టీడీపీ కార్యకర్తల ధైర్యాన్ని, వైసీపీ నేతల పిరికితనాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడారు. గత ఐదేళ్లులో అక్రమ కేసులతో ఎంత వేధించినా టీడీపీ శ్రేణులు దైర్యంగా నిలబడ్డారని తెలిపారు. సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులపై పోలీసులు ఇచ్చిన నోటీసులకే వైసీపీ నేతలు రాజకీయ సన్యానం అంటున్నారని ఎద్దేవా చేశారు. నాడు టీడీపీ కార్యకర్తలు తప్పు చేయలేదు కాబట్టే అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారని వెల్లడిరచారు. తప్పు చేసిన ఓ ఒక్కరినీ ప్రభుత్వం విడిచిపెట్టదని మంత్రి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ నాయకులు కమిటీల ఓటింగ్‌కు వస్తున్నారా? అని ఎమ్మెల్యేలను ఆరాతీశారు. బలం లేనప్పుడు పోటీ ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు.