టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే... రాయలసీమ : నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమ అభివృద్ధి చెందిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామన్నారు. తీర్మానంతో పాటు వచ్చే ఏడాదిలోగా బెంచ్ ఏర్పాటు చేసేలా పనిచేస్తామని పేర్కొన్నారు. సాగునీటితోపాటు ఇతర ప్రాజెక్టులన్నీ టీడీపీ ప్రభుత్వం హయాంలో వచ్చాయని మంత్రి చెప్పారు. అనంతపురానికి కియా వచ్చిందంటే ఎన్డీఏ ప్రభుత్వం వల్లేనని గుర్తు చేశారు. చిత్తూరు, కడప కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వచ్చాయన్నారు. టీసీఎల్, ఫాక్స్ కాన్ సంస్థలన్నీ రాయలసీమ ప్రాంతానికే వచ్చాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటీ సహా వివిధ సంస్థలు ఏర్పాటైన విషయాన్ని గుర్తుచేశారు.
Tags :