రెడ్ బుక్ 3.0 .. మంత్రి లోకేష్ సంకేతాలు...
గత ప్రభుత్వం పాలనలో విపక్ష టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు, పోలీసులు, ఇతర అధికారులపై.. ఆపరేషన్ రెడ్ బుక్ అమలవుతోంది. అప్పట్లో తమను టార్గెట్ చేసిన వారిలో చాలామందిపై ఇప్పటికే రెడ్ బుక్ చాప్టర్ 1, చాప్టర్ 2లో చుక్కలు చూపిన లోకేష్.. ఇప్పుడు చాప్టర్ 3 స్టార్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో పెట్టుబడుల అన్వేషణలో బిజీగా ఉన్న నారా లోకేష్.. మధ్యలో టీడీపీ ఎన్నారై నేతలతో భేటీ అవుతున్నారు.
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో తన యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఇందుకోసం త్వరలో రెడ్ బుక్ ఛాప్టర్ 3 ఓపెన్ చేస్తామని ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామన్నారు. గతంలో వైసీపీ పాలనలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే లుకౌట్ నోటీసులు ఇచ్చే వారని, కానీ నోటీసులకు భయపడకుండా ఎన్నారైలు నిలబడ్డారని లోకేష్ ప్రశంసించారు. ఇ
ప్పుడు వారిని టార్గెట్ చేసిన వారికి రెడ్ బుక్ ఛాప్టర్ 3లో సమాధానం ఇస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. దీంతో అప్పట్లో యువగళం పాదయాత్రతో పాటు సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకున్న పోలీసు అధికారులు ఈసారి రెడ్ బుక్ ఛాప్టర్ 3లో ఉండబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ చాప్టర్ 3 కొందరిలో ఆందోళనకు కారణమవుతోంది .ఎందుకంటే ఇప్పటికే చాప్టర్ 1, చాప్టర్ 2లో పేర్లు ఉన్నవారు ఎలా బుక్కయ్యారో సహచరులు చూశారు కూడా. ఇప్పుడు తమ పరిస్థితి కూడా అంతేనా అన్న ఆందోళనవారిలో వ్యక్తమవుతోంది. నాడు గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేశామని.. ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయామని సదరు అధికారులు టెన్షన్ పడుతున్నారట.