హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా.. నిలపడమే మా లక్ష్యం
యుద్ధ ప్రాతిపదికన మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నరెడ్కో ప్రాపర్టీ షోకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రగతిలో నరెడ్కో ఒక భాగం. మా ప్రభుత్వం నరెడ్కోకు అండగా ఉంటుంది. గతంలో ఉన్న అనుమతులను మా ప్రభుత్వం రద్దు చేయదు. క్రెడాయ్, ట్రెడ్కో, నరెడ్కో కలిసి ఒక కమిటీ ఏర్పడు చేయండి. నెలకు ఒకసారైన మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్ నిర్మించింది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ నిర్మిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నాం. ప్రపంచ స్థాయి స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ తీసుకొస్తున్నాం. నగరంలో మౌలికసదుపాయాల కల్పన కోసం రూ.10 వేల కోట్లు కేటాయించాం. మా ప్రభుత్వం వ్యాపార రంగానికి అండగా ఉంటుంది. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం. గత ప్రభుత్వాల మాదిరి కాదు అని అన్నారు.