ASBL Koncept Ambience
facebook whatsapp X

SSMB29లో కోసం రంగంలోకి నాజ‌ర్

SSMB29లో కోసం రంగంలోకి నాజ‌ర్

సీనియ‌ర్ యాక్ట‌ర్ గా సౌత్ లో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాజ‌ర్. విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా నాజ‌ర్ ఏ పాత్ర లోనైనా మెప్పించ‌గ‌ల‌డు. అందుకే ఎంతో కాలంగా ఆయ‌న యాక్టింగ్ జ‌ర్నీ కొన‌సాగుతుంది. బాహుబ‌లి తో బిజ్జ‌ల‌దేవుడిగా నాజ‌ర్ పండించిన విల‌నిజం అంద‌రినీ ఎంతగానో మెప్పించింది. థియేట‌ర్ల ఆర్టిస్ట్ గా కెరీర్ మొద‌లు పెట్టిన నాజ‌ర్ ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చి న‌టుడిగా సెటిల‌య్యాడు. ఇదిలా ఉంటే నాజ‌ర్ ప్ర‌స్తుతం మ‌హేష్- రాజ‌మౌళి కాంబోలో రానున్న సినిమా కోసం ట్రైన‌ర్ గా మారుతున్నాడ‌ని స‌మాచారం. SSMB29 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు వ‌ర్క్ షాప్స్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

మ‌రో రెండు మూడు రోజుల్లో మ‌హేష్ కూడా ఇందులో జాయిన్ కానున్నాడు.ఈ  వ‌ర్క్ షాప్ కోసం నాజ‌ర్ ట్రైన‌ర్ గా మారుతున్నాడ‌ట‌. సినిమాలో సంభాష‌ణ‌లు ప‌లికే విధానం, మాండ‌లికంపై నాజ‌ర్ ట్రైనింగ్ ఇవ్వ‌నున్నాడ‌ట‌. క్యారెక్ట‌రైజేష‌న్ కు త‌గ్గ‌ట్టు ఏ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంద‌నే దానిపై నాజ‌ర్ కు చాలా క్లారిటీ ఉండ‌టం వ‌ల్లే ఆ బాధ్య‌త‌ను రాజ‌మౌళి నాజ‌ర్‌కు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఇయ‌ర్ ఎండింగ్ కు సినిమా స్టార్టయ్యే ఛాన్సుంద‌ని ఇన్ సైడ్ టాక్.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :