ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎన్‌ఏటీఎఫ్‌-తానా త్రోబాల్‌ టోర్నమెంట్‌ విజయవంతం

ఎన్‌ఏటీఎఫ్‌-తానా త్రోబాల్‌ టోర్నమెంట్‌ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగుసంఘం(తానా) ఆధ్వర్యంలో నార్త్‌ అమెరికా త్రోబాల్‌ ఫెడరేషన్‌ (ఎన్‌ఎటిఎఫ్‌) ఆధ్వర్యంలో త్రోబాల్‌ టోర్నమెంట్‌ ను విజయవంతంగా నిర్వహించారు. అక్టోబర్‌ 26న డల్లాస్‌లో నిర్వహించిన జాతీయ పురుషులు, మహిళల త్రోబాల్‌ టోర్నమెంట్‌లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తానా స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ నాగమల్లేశ్వర పంచుమర్తి ఆధ్వర్యంలో ఎన్‌ఎటిఎఫ్‌ అధ్యక్షురాలు మనుగొంది, ఉపాధ్యక్షురాలు వసంత కావురి, ఉత్తర అమెరికా ఐటిఎఫ్‌ ఉపాధ్యక్షుడు తేజేష్‌ రాజప్ప సహకారంతో ఈ టోర్నమెంట్‌ జరిగింది. అంకితభావం, టీమ్‌వర్క్‌  ఈవెంట్‌కు విస్తృత ప్రచారం తీసుకొచ్చింది. ఎన్‌ఎటిఎఫ్‌  మీడియా సమన్వయకర్త కావ్య వురుకుల ఈ టోర్నీకి మరింత ప్రాచుర్యం కల్పించేలా కృషిచేశారు. ఐటీఎఫ్‌ తరఫున అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ సంపూర్ణ హెగ్డే, టెక్నికల్‌ కమిటీ కన్వీనర్‌ రాము పిల్లి ఈ కార్యక్రమం కోసం భారత్‌ నుంచి వచ్చారు.  బృందం పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి ప్రొఫెషనల్‌ టచ్‌ వచ్చింది. రాము పిల్లి ప్రధాన కోచ్‌గా వ్యవహరించి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. త్రోబాల్‌ ఆరోగ్య ప్రయోజనాలను, ముఖ్యంగా ఆక్యూప్రెషర్‌ ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడడం వంటి అంశాలను అందరికీ వివరించేందుకు సంపూర్ణ హెగ్డే క్రీడాకారులతో సంభాషించారు. త్రోబాల్‌ వృద్ధులకు మోకాళ్ల నొప్పి నియంత్రణలో ఎలా సహాయపడుతుందనే అంశంపై జరుగుతున్న అధ్యయనాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. 

అక్టోబర్‌ 26న ఉదయం 9 గంటలకే ఈ టోర్నమెంట్‌ మొదలైంది. త్రోబాల్‌కు పెరుగుతోన్న ప్రాచుర్యం, దీన్ని ఒలింపిక్‌ గుర్తింపు తీసుకురావాల్సిన ఉమ్మడి లక్ష్యాన్ని మను గొంది ఈ సందర్భంగా వివరించారు. ఈ టోర్నమెంట్‌లో తొలుత 14 జట్లు పాల్గొంటాయని భావించినా, ఆసక్తి పెరగడంతో ఎన్‌ఎటిఎఫ్‌ 26 జట్లకు విస్తరించింది. మూడు విభాగాలుగా టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసి.. విభాగాల ప్రకారం ట్రోఫీలను ఫెడరేషన్‌ ప్రదానం చేసింది.  ఈ ఈవెంట్‌కు ప్రత్యేకంగా మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు స్పాన్సర్లు బలమైన మద్దతు అందించారు. ఉత్తర అమెరికాలో ఇదే తరహా మొదటి పురుషుల టోర్నమెంట్‌ అదనపు ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. తానా ప్రాంతీయ కోఆర్డినేటర్‌ పరమేష్‌ దేవినేని, తానా కౌన్సిలర్‌-ఎట్‌ లార్జ్‌ సతీష్‌, తానా బోర్డ్‌ డైరెక్టర్‌ మల్లి వేమన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్‌ఎటిఎఫ్‌ సభ్యులను ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించిన తాజా మాజీ క్రీడల కోఆర్డినేటర్‌ శశాంక్‌ యార్లగడ్డ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.  

ఈ టోర్నమెంట్‌కు సకాలంలో నిర్వహించేందుకు శ్వేత బొమ్మారెడ్డి, నవీన పరస, రోహిత్‌ తోట, దివ్య గోషామహల్‌ సనాతన్‌, నాగ రమేశ్‌ కమీశెట్టి, వర్ష నటరాజన్‌, ధన్య విజయ్‌, భార్గవ్‌ గోరంట్ల, భావన కమిశెట్టి, శ్రీవాత్సవ్‌ బండ, సత్య కీర్తి కొట్టె, కవిత.. ఇలా అనేకమంది వాలంటీర్లు శ్రమించారు. వెబ్‌సైట్‌ టీమ్‌, శ్రీకాంత్‌ గుమిరెడ్డి ఆద్వర్యంలో లైవ్‌ స్కోర్లు అందించడంతో పాటు జట్ల రిజిస్ట్రేషన్లు, ర్యాండమ్‌ డ్రాలు నిర్వహించడం ద్వారా ఆటగాళ్లు, అభిమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈవెంట్‌ సజావుగా సాగేందుకు కృషిచేశారు. తానా, ఎన్‌ఏటీఎఫ్‌ సంయుక్తంగా వచ్చే ఏడాది మే 3న నార్త్‌ కరోలినాలోని షార్లెట్‌లో తదుపరి టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :