ASBL NSL Infratech
facebook whatsapp X

చికాగోలో నాట్స్ లీడర్‌షిప్ మీట్ అండ్ గ్రీట్

చికాగోలో నాట్స్ లీడర్‌షిప్ మీట్ అండ్ గ్రీట్

మదన్ పాములపాటికి అభినందనల వర్షం

చికాగో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ లీడర్‌షిప్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. నాట్స్ కార్యనిర్వాహక సభ్యులు, చికాగలోని పలు తెలుగు సంఘాల  నాయకులు ఈ మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్నారు. ఇటీవల నాట్స్ అధ్యక్షుడిగా బాధ్యతలను భుజానికెత్తుకున్న మదన్ పాములపాటిని నాట్స్ నాయకులు, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. చికాగోలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడంలో మదన్ పాములపాటి కీలక పాత్ర పోషించడాన్ని ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులంతా ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించారు. చికాగోలోని మాల్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ కార్యక్రమానికి 450 మందికిపైగా తెలుగువారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నాట్స్ బోర్డ్ మాజీ డైరక్టర్ శ్రీనివాస్ అరసాడ, నేషనల్ కోఆర్డినేటర్ ఆర్కే బాలినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరీష్  జమ్ముల నాట్స్ చాప్టర్ సమన్వయకర్త వీర తక్కెళ్ళపాటి నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాజీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, శేఖర్  అన్నె, నాట్స్ బోర్డ్ డైరక్టర్ రాజ్ అల్లాడ, అడ్వైజరీ బోర్డు మెంబర్ డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బెల్లం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చికాగోలో నాట్స్ టీమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను, చికాగో నాట్స్ నాయకుల చిత్తశుద్ధిని ప్రత్యేకంగా అభినందించారు.

లీడర్ షిప్ మీట్ అండ్ గ్రీట్ లో నాట్స్‌తో పాటు ఇతర తెలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు. నాట్స్  సేవా కార్యక్రమాలను, కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మదన్ పాములపాటిని అభినందించారు. నాట్స్‌తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. వీరిలో తానా సంస్థ నుండి మాజీ అధ్యక్షులు పద్మశ్రీ ముత్యాల, హేమ కానూరు, హర్ష గరికపాటి, ఉమా కటికి, కృష్ణమోహన్, హను చెరుకూరి, చిరు గళ్ళ, రవి కాకర, కృష్ణ చిట్టూరి, ఆటా సంస్థ నుండి  కేకే రెడ్డి, మహిపాల్ రెడ్డి,  మహిధర్ రెడ్డి, వెన్ రెడ్డి, భాను స్వర్గం, రాజ్ అడ్డగడ్డ, నాటా సంస్థ నుండి రాంభూపాల్ రెడ్డి, గోపి పిట్టల, టీఏజీసీ సంస్థ నుండి సంతోష్ కోడూరు, పరం రెడ్డి,  శ్రీధర్ రెడ్డి, సీఏఏ నుండి శ్వేతా చీడే, మాలతి దామరాజు, సుజాత అప్పలనేని,  టీటీఏ నుండి హేమచంద్ర వీరవల్లి, మధు ఆరంభకం, జి.సి.ఐ.సి నుండి వెంకట్ లింగారెడ్డి, సుగంతి, శేషు చామర్తి, సృజన్, లక్ష్మీనారాయణ తోటకూర, దీక్ష, ఐఏజీసీ నుండి మనోజ్ సింగంశెట్టి, మల్లారెడ్డి, సీవీఏ నుండి శ్రీనివాస్ పెదమల్లు, ఏపీటీఏ నుండి రవి తోకల, కుమార్ నల్లం, ఐటీసర్వ్ నుండి రజిని ఆకురాతి, రమేష్ తూము, రత్నాకర్ కారుమూరి తదితరులు పాల్గొన్నారు.

చికాగో టీం నుండి బోర్డ్ ఆఫ్ డైరక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఈసీ మెంబర్స్ ఆర్కే బాలినేని, శ్రీ హరీష్ జమ్ముల,  ఇమాన్యుయల్ నీల, మాజీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ మహేష్ కాకరాల, మూర్తి  కొప్పాక, శ్రీనివాస్  బొప్పన ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

చికాగో చాప్టర్ టీం నుండి వీర తక్కెళ్ళపాటి, హవీల దేవరపల్లి, బిందు వీధులమూడి, రోజా చెంగలశెట్టి, భారతి పుట్ట, రజియా వినయ్, సిరి బచ్చు, అనూష కదుము, గ్రహిత బొమ్మిరెడ్డి, భారతి కేసనకుర్తి, ప్రియాంక పొన్నూరు, సింధు కంఠమనేని, చంద్రిమ దాడి, నరేంద్ర కడియాల, శ్రీనివాస్ ఇక్కుర్తి, మహేష్ కిలారు, చెన్నయ్య కంబల, నవీన్ జరుగుల, అంజయ్య వేలూరు, ఈశ్వర్ వడ్లమన్నాటి తదితరులను నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని సత్కరించారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులను పిల్లలు తమ భరతనాట్యంతో, రవి తోకల, సునీత విస్సాప్రగడ తమ గాత్రంతో అలరించారు.

నిర్వాహకులు రుచికరమైన ఆహారాన్ని అందించిన దాతలు బోవెల్ ఓ బిర్యానికి కి చెందిన అరవింద్ కోగంటి మరియు గిరి మారినిల ని నాట్స్ నాయకత్వం అభినందించింది. అలాగే వేదిక ఏర్పాటులో అజయ్ సుంకర, వినోజ్ చెనుమోలు మరియు ప్రమోద్ చింతమనేని, వేదిక అలంకరణకు చక్కగా చేసిన సంస్కృతి డెకరేషన్స్ నుండి బిందు బాలినేని ని  అభినందించారు. మాధురి పాటిబండ్ల, ఆర్.జే క్రాంతి  ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :