NATS: చికాగోలో నాట్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) థ్యాంక్స్ గివింగ్ వీక్‌లో చికాగో నాట్స్ విభాగం దీపావళి వేడుకలను నిర్వహించింది. నాపర్‌విల్లే లోని మాల్ ఆఫ్ ఇండియాలో తెలుగువారు ఒక్కచోట దీపావళి టపాసులు కాల్చారు. ఆట పాటలతో పాటు చక్కటి విందును ఏర్పాటు చేసుకుని పండుగ వేడుకలు జరుపుకున్నారు.
చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు హవేళ మద్దెల, బిందు వీడులమూడి, లక్ష్మీ బి, రోజా సీలంసెట్టి, చంద్రిమ దడి, కిరణ్మయి గూడపాటి, సిరి ప్రియా బచ్చు, భారతి కేసనకుర్థి, వీర తక్కెల్లపాటి, నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, శ్రీనివాస్ ఎక్కుర్తి, ఈశ్వర్ వడ్లమనాటి, మహేష్ కిలారు లు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు. మాధురి పాటిబండ, బిందు బాలినేని, రవి బాలినేని, రామ్ కేశనకుర్తి, శ్రీనివాస్ పిల్ల, పాండు చెంగలశెట్టి, నవాజ్, గోపి తదితర నాట్స్ వాలంటీర్లు ఈ వేడుకల కోసం అందించిన సేవలను నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు అభినందించారు.
నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్‌కె బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, కిరణ్ మందాడి, రవి తుమ్మల, కిషోర్ నారే, మురళి మేడిచెర్ల, రాజేష్ కాండ్రు, నాట్స్ బోర్డు మాజీ సభ్యులు మూర్తి కొప్పాక, మహేష్ కాకర్ల, శ్రీనివాస్ అరసాడ మరియు శ్రీనివాస్ బొప్పన తదితరులు ఈ వేడుకలకు అందించిన సహాయానికి చికాగో నాట్స్ విభాగం ధన్యవాదాలు తెలిపింది.
చికాగోలో తెలుగువారిని కలిపి దీపావళి వేడుకలను నిర్వహించినందుకు చికాగో నాట్స్ టీం సభ్యులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు.
ఈ కార్యక్రమానికి ప్రాథమిక స్పాన్సర్ గా వ్యవహరించి, అందరికీ ఎంతో రుచికరమైన భోజనం అందించిన బౌల్ ఓ బిర్యానీ వారికి నిర్వాహకులు నాట్స్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.