ASBL NSL Infratech

అట్లాంటాలో భారతీయ రాయబార అధికారులను కలిసిన నాట్స్ బృందం

అట్లాంటాలో భారతీయ రాయబార అధికారులను కలిసిన నాట్స్ బృందం

 

నాట్స్ సేవా కార్యక్రమాలను వివరించిన నాట్స్ నాయకత్వం

అట్లాంటా లోని భారతీయ రాయబార అధికారి రమేశ్‌ ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నాయకులు కలిసి నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అట్లాంటా నాట్స్ నాయకులు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేశ్ పెద్ది, అట్లాంటా నాట్స్ నాయకులు ఇండియన్ కాన్సులేట్ అధికారులతో చర్చించారు. నాట్స్ హెల్ప్ లైన్, అమెరికాకు వచ్చే విద్యార్ధులకు చేయాల్సిన, చేయకూడని పనులపై అవగాహన, గృహహింస బాధితులకు అండగా నిలబడటం, మానసిక పరిణితి పెంచేలా సదస్సులు, ప్రతిభ గల విద్యార్ధులకు పురస్కారాలు, స్థానిక కమ్యునిటీ సేవలు ఇవన్నీ నాట్స్ ఎలా చేస్తుంది..? అమెరికాలో తెలుగుజాతికి ఎలా అండగా నిలబడుతుందనే విషయాలను కాన్సులేట్ అధికారులకు వివరించారు. నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్న అట్లాంటా భారత రాయబార కార్యాలయాన్ని నాట్స్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించింది. ప్లోరిడాలో కూడా భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించే కార్యక్రమాల్లో నాట్స్ చురుకుగా పాల్గొంటుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు.. భారత రాయబార కార్యాలయంతో తమ అనుబంధం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని ప్రశాంత్ వ్యక్తం చేశారు.
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :