ASBL NSL Infratech
facebook whatsapp X

6 ప్రెస్టిజియస్ విన్స్ తో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను స్వీప్ చేసిన నాని దసరా

6 ప్రెస్టిజియస్ విన్స్ తో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను స్వీప్ చేసిన నాని దసరా

నేచురల్ స్టార్ నాని హై-ఆక్టేన్ మాస్, యాక్షనర్ 'దసరా' ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో రిమార్కబుల్ ఇంపాక్ట్ ని చూపింది, ఆరు వేర్వేరు విభాగాలలో అవార్డులు గెలుచుకొని స్వీప్ చేసింది.  

ధరణి క్యారెక్టర్ లోఅదరగొట్టిన నాని ప్రతిష్టాత్మకమైన ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. సినిమా విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాని ఇప్పుడు ప్రతిష్టాత్మక అవార్డు గెలుపొందారు.

వెన్నెల పాత్రలో అత్యద్భుతమైన నటనకు గానూ కీర్తి సురేష్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దసరా క్రియేటివ్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్ ని కూడా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన విజనరీ అప్రోచ్ తో గౌరవాన్ని అనుకున్నారు. తన తొలి సినిమాతోనే 100 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్న తొలి డెబ్యూ డైరెక్టర్‌గా సరికొత్త మైల్ స్టోన్ ని నెలకొల్పారు.

సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సినిమా డైనమిక్ విజువల్స్‌ను అందించడంలో అసాధారణమైన వర్క్ కి గాను అవార్డు అందుకున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సినిమా సెట్స్, విజువల్ ఎన్విరాన్మెంట్ రూపొందించడంలో తన అద్భుతమైన పనితీరుతో అవార్డును అందుకున్నారు.

ఎనర్జిటిక్, ఎంగేజింగ్ ధూమ్ ధామ్ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌ను అవార్డ్ అందుకున్నారు.  

అవార్డు అందుకున్న అనంతరం నాని మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు నాకు చాలా అవార్డులు రావాలనే కోరిక ఉండేది, కానీ ఇప్పుడా ఆ కోరిక తగ్గింది. నాకు అవార్డుల కోసం ఇప్పుడు బలమైన కోరిక లేదు. ఇప్పుడు నా కోరికంతా నా దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, నా సినిమాల్లో పరిచయమైన కొత్త టాలెంట్‌లు, ఇతర ఆర్టిస్టులు అవార్డులు అందుకోవాలనే. అదే నన్ను చాలా ఉత్తేజపరుస్తుంది.

ఈ రోజు, శ్రీకాంత్, శౌర్యువ్ అవార్డులు గెలుచుకున్నందుకు నేను స్పెషల్ గా థ్రిల్ అయ్యాను. ఆ మూమెంట్ భాగం కావడం విశేషం. దర్శకులు శ్రీకాంత్, శౌర్యువ్‌ల విజయాలను పురస్కరించుకుని అవార్డు కార్డ్‌లను ఫోటోఫ్రేమ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను.

వారు కోరుకునే చోటికి చేరుకోవడానికి వారి ప్రయాణంలో ఒక చిన్న భాగమే నాకు గొప్ప అవార్డు. వారి తొలి అడుగుకు నేను ఒక చిన్న ఇటుక అయినా అందించినట్లయితే అది నాకు సరిపోతుంది. 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. దసరా, హాయ్ నాన్నా చాలా ప్రత్యేకమైనవి.

రెండు బిగ్ బ్లాక్‌బస్టర్‌లు సాధించిన నానికి 2023 నిజంగా చాలా ప్రత్యేకమైన సంవత్సరం. నాని ఇప్పుడు సరిపోదా శనివారంతో వస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దసరాని అద్భుతంగా నిర్మించిన SLV సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరి, నాని, శ్రీకాంత్ ఓదెల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో మరొక యూనిక్, హై బడ్జెట్ మూవీ కోసం మరోసారి కొలాబరేషన్ కి రెడీగా వున్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :