ధనుష్ పై నయన్ ఫైర్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) పై టాప్ హీరోయిన్ నయనతార(Nayanthara)కు బాగా కోపమొచ్చింది. తన కోపాన్ని వ్యక్తం చేస్తూ ఏకంగా మూడు పేజీల లెటర్ ను నెట్టింట రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పదేళ్ల కిందట ధనుష్ బ్యానర్ లో నయనతార నానుమ్ రౌడీ తాన్(Nanum Rowdy Than) సినిమాను చేసింది. ఆ సినిమాకు అనిరుధ్(Anirudh) ఇచ్చిన మ్యూజిక్ ఆడియో పరంగా ఎంతో క్లిక్ అయ్యాయి.
ఇక అసలు విషయానికొస్తే నెట్ఫిక్స్(netfilx)లో నయన్ డాక్యుమెంటరీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీలో నయన్ కెరీర్ కు సంబంధించిన ఎన్నో విశేషాలు పొందుపరిచారు. దానికి సంబంధించిన టీజర్ లో నానుమ్ రౌడీ తాన్ కు సంబంధించిన 3 సెకన్ల కంటెంట్ ను వాడుకోవడం ధనుష్ టీమ్ గుర్తించి కాపీ రైట్స్ కింద రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు. నయన్(Nayan) ఈ సమస్యను పరిష్కరించాలని ఎంత చూసినా కుదరకపోవడంతో ఆ ఫుటేజ్‌ను ఎడిట్ చేసి తీసేశారు.
నయనతార కోపానికి కారణమిదే. ఓ పేరున్న ఫ్యామిలీ, తండ్రి, అన్నయ్య మద్దుతులో ఎదిగిన నటుడిగా ఉన్న మీరు ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చిన తన లాంటి నటికి ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదని మొత్తం ఇష్యూని లెటర్ లో తెలిపింది. తనపై, తన భాగస్వామిపై, తమ సినిమాపై ధనుష్ ఏర్పరచుకున్న ద్వేషాన్ని ఆ లెటర్ లో బట్టబయలు చేసింది నయన్. అంతేకాదు ఎన్ఓసీ(NOC) కోసం రెండేళ్లు ట్రై చేసి ఫెయిల్ అయిన విషయాన్ని గురించి కూడా నయన్ ధనుష్ ని నిలదీసింది. నానుమ్ రౌడీ తాన్ సాంగ్స్ తన గుండెకు దగ్గరగా ఉంటాయని, ఇప్పుడా పాటలే తన గుండెని ముక్కలు చేశాయన బాధను వ్యక్తం చేసింది. అంతేకాదు 2016లో తనకు ఫిల్మ్‌ఫేర్(Filmfare) అవార్డ్ వచ్చాక తన గెలుపుని తట్టుకోలేక ధనుష్ ఈగోని బయటపెట్టిన వైనాన్ని ఫిల్మ్ సర్కిల్స్ లో విన్నానని కూడా నయన్ ఈ లెటర్ లో పేర్కొంది. మరి ఈ లెటర్ కు ధనుష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.