ASBL NSL Infratech

ఆ హిట్ డైరెక్ట‌ర్ తో లేడీ సూప‌ర్ స్టార్ మూవీ

ఆ హిట్ డైరెక్ట‌ర్ తో లేడీ సూప‌ర్ స్టార్ మూవీ

ఓ వైపు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ న‌య‌న‌తార మ‌న‌సంతా సోలోగా బాక్సాఫీస్ ను దున్న‌డం పైనే ఉంది. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఇప్ప‌టికే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. కానీ అవేమీ అమ్మ‌డి స్థాయిని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్ల‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌లేదు. అయిన‌ప్ప‌టికీ త‌న గురి మొత్తం లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పైనే ఉంది. రీసెంట్ గా యాక్ట‌ర్ శ‌శి కిర‌ణ్, న‌య‌న్ కు మంచి స్టోరీ చెప్ప‌డంతో ఆయ‌న‌కు డైరెక్ట‌ర్ ఛాన్స్ ఇచ్చేసింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ శిష్యుడైన విష్ణు అనే కొత్త కుర్రాడికి కూడా న‌య‌న్ ఛాన్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. విష్ణు చెప్పిన క‌థకు న‌య‌న‌తార కనెక్ట్ అవ‌డంతో ఇంకేం ఆలోచించ‌కుండా ఓకే అనేసింది.

తాజాగా సామినాధ‌న్ నితిల‌న్ కు కూడా న‌య‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. స్టోరీకి సంబంధించిన నాలుగైదు సిట్టింగ్స్ అయ్యాక చివ‌రి సిట్టింగ్ లో న‌య‌న్ ఓకే చెప్పింద‌ట‌. నితిల‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రీసెంట్ గా వ‌చ్చిన మ‌హారాజా మంచి హిట్ అయిన విష‌యం తెలిసిందే. కాబ‌ట్టి న‌య‌న్, నితిల‌న్ తో ముందుకెళ్ల‌డం వ‌ల్ల నష్ట‌మేమీ ఉండదు. మొత్తానికి న‌య‌న్ ఫోక‌స్ అంతా ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌పైనే ఉంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :