ASBL Koncept Ambience
facebook whatsapp X

ర‌వితేజ‌కు బ‌ద‌లుగా బాల‌య్య

ర‌వితేజ‌కు బ‌ద‌లుగా బాల‌య్య

వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రానున్న సినిమాల లిస్ట్ క్ర‌మంగా మారిపోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఫిక్స్ అయిన వాటిలో విశ్వంభ‌ర రిలీజ్ లో మాత్ర‌మే ఎలాంటి మార్పు లేదు. జ‌న‌వ‌రి 10న విశ్వంభ‌ర రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి, వెంక‌టేష్ కాంబినేష‌న్లో వ‌స్తున్న సినిమాకు ఇంకా డేట్ ఫిక్స్ చేయ‌లేదు కానీ పండ‌క్కి రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ అజిత్ తో నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ రేసు నుంచి త‌ప్పుకుని ఆ ప్లేస్ లో విద‌ముయార్చిని తీసుకురావాల‌ని చూస్తున్నార‌ట‌. ఎలా అయినా స‌రే సంక్రాంతి బెర్త్ ను వ‌దులుకునే ఆలోచ‌న‌లో అజిత్ లేడ‌ట. వీటితో పాటూ సంక్రాంతికి ర‌వితేజ‌- భాను భోగ‌వ‌ర‌పు క‌ల‌యిక‌లో సితార బ్యాన‌ర్ నిర్మిస్తున్న సినిమాను తీసుకురావాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు.

కానీ ఆ సినిమా షూటింగ్ లో జ‌రిగిన ప్ర‌మాదం వ‌ల్ల ర‌వితేజ గాయ‌ప‌డి ఏకంగా రెండు నెల‌ల పాటూ రెస్ట్ తీసుకోవాల్సి వ‌చ్చింది. దీంతో ఈ సినిమా పండ‌క్కి రావ‌డం క‌ష్ట‌మేన‌ని ఇన్‌సైడ్ టాక్. దీంతో ఆ ప్లేస్ లోకి అదే బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న బాల‌య్య‌109ను రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట మేక‌ర్స్. డిసెంబ‌ర్ లో రిలీజ్ కంటే సంక్రాంతికి రావ‌డ‌మే బెస్ట్ అని బాల‌య్య కూడా అనుకుంటున్నాడ‌ట‌. జ‌న‌వ‌రి 9,11,12 తేదీల్లో ఏదో తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. న‌వంబ‌ర్ నుంచి ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టి సినిమాను జ‌న‌వ‌రికి రిలీజ్ చేయాల‌నేది మేక‌ర్స్ ప్లాన్. త్వ‌ర‌లోనే ఈ విష‌య‌మై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే ఛాన్సుంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :