ASBL NSL Infratech
facebook whatsapp X

తెలంగాణలోనూ ఎన్డీయే ప్రభుత్వం..? ఇదేనా కూటమి పార్టీల ప్లాన్..?

తెలంగాణలోనూ ఎన్డీయే ప్రభుత్వం..? ఇదేనా కూటమి పార్టీల ప్లాన్..?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి సూపర్ సక్సెస్ సాధించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలూ ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లి గతంలో ఎన్నడూ సాధించని విజయాన్ని నమోదు చేశాయి. దీంతో ఇదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలనే దిశగా ఆ పార్టీలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని ఇటీవల చంద్రబాబు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దీని వెనుక ఉద్దేశం ఇదేనని అంచనా. 2028 ఎన్నికల నాటికి మూడు పార్టీలూ ఉమ్మడిగా బరిలోకి దిగితే కచ్చితంగా అధికారాన్ని కైవసం చేసుకోవచ్చనే ఆలోచనలో ఆ పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. దక్షిణాదిలో కర్నాటక తర్వాత బీజేపీ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే. అందుకే తెలంగాణలో అధికారాన్ని తప్పకుండా చేజిక్కించుకుంటామనే నమ్మకం కూడా ఆ పార్టీకి ఉంది. ఈ దఫా ఎన్నికల్లో అసెంబ్లీలో 8, పార్లమెంటులో 8 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. కీలకమైన హైదరాబాద్ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ డీలా పడిపోవడంతో తప్పకుండా పార్టీకి అధికారం ఖాయమనుకుంటోంది. ఇప్పుడు ఫైట్ అంతా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందనే టాక్ నడుస్తోంది.

ఇదే సమయంలో బీజేపీ కూడా ఏపీలో లాగా టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తే ప్రయోజనం ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ మంచి కేడర్ ఉంది. జనసేన కూడా కాస్తో కూస్తో ప్రభావం చూపించగలదు. గతంలో బీజేపీ, జనసేన కలిసి కూడా పనిచేశాయి. ఇప్పుడు టీడీపీని కూడా కలుపుకుపోతే హైదరాబాద్, ఖమ్మం లాంటి చోట్ల పార్టీకి తిరుగులేని విజయం దక్కుతుందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇప్పుడు టీడీపీ తమతో ఉంటే ఆ ఓటు బ్యాంకు తమకు కలిసొస్తుందనే ఆలోచన ఉంది.

తెలంగాణలో పార్టీని బలోపేతం ద్వారా కాస్తోకూస్తో ప్రయోజనం ఉంటుందని టీడీపీ కూడా ఆలోచిస్తోంది. బీఆర్ఎస్ పనైపోయిందనుకుంటున్న పలువురు నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో చాలా మంది బీజేపీ కంటే టీడీపీయే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లను చేర్చుకుని బీజేపీతో కలిసి వెళ్తే తప్పకుండా విజయం సాధించవచ్చనే నమ్మకం టీడీపీలో కూడా కనిపిస్తోంది. జనసేన కూడా ఉడతాభక్తిగా సాయపడొచ్చు. ఇలా ఏపీలో లాగే తెలంగాణలో కూడా 2028లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మూడు పార్టీలూ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :