ASBL NSL Infratech

మిన్నియాపోలిస్ మిన్నెసోటాలో మిన్నంటిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు

మిన్నియాపోలిస్ మిన్నెసోటాలో మిన్నంటిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అత్యద్భుత విజయము సాధించడంతోపాటు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండవసారి విభజితాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని మిన్నెసోటా రాష్ట్ర జంట నగరాలైన మిన్నియాపోలిస్/ సెయింట్ పాల్‌లలోని ఎన్నారై టీడిపి, ఎన్నారై జనసేన, ఎన్నారై బిజెపి నాయకులు ఘనంగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సుమారు 200 పైగా కూటమి అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. 

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత మంది ఎన్నారైలు తమ మూలాలు మర్చిపోకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పోటీచేసి విజయం సాధించడాన్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.

ఆన్లైన్ ద్వారా తమ సందేశాలను తాము చేయబోతున్న కార్యక్రమాలను తణుకు ఎమ్మెల్యే శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ, పామర్రు ఎమ్మెల్యే శ్రీ విజయకుమార్ రాజా తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఎన్నారైలు ఈ విజయంకోసం పడిన కష్టాలను, చేసిన సహాయాన్ని మరువలేమన్నారు. 

ఈ కార్యక్రమాన్ని ఎన్నారై టిడిపి మిన్నియాపోలిస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామ్ వంకిన, రావ్ గుత్తా, వెంకట్ జువ్వా, వేదవ్యాస్ అరవపల్లి, అజయ్ తాళ్లూరి, వివేక్ వల్లూరి మరియు మిత్రులు శ్రీమాన్ యార్లగడ్డ, నాగ్ నల్లబోలు, నాయుడు సాలాది, కాశీ బురిడి, ఆర్కే, వెంకన్న చౌదరి, సుమన్ లావు, హరీష్ చింతాడ, పరమేశ్వర్, నాగ్ బొల్లు, సత్యనారాయణ, అనిల్ స్వయంపు, మురళి ముత్యాల, బాల అక్కిన, అశోక్ సుంకవల్లి, కోటేశ్వర పాలడుగు మరియు జనసేన నాయకులు సంతోష్, రఘు గొలకోటి, రామ్ కూటల,  తదితరులు సహకారం అందించారు. 

కార్యక్రమం తరువాత వచ్చినవారందరికీ పసందైన విందు భోజనాన్ని అందించారు.  మిన్నియాపోలిస్ & సెయింట్ పాల్ లోనూ ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడిపి నాయకులు, జనసేన నాయకులు, బిజెపి నాయకులు, ఈప్రాంతంలో చదువుతున్న పలువురు విద్యార్థులు మరియు మహిళలు, పిల్లలు, పెద్దవారు కూడా ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :